భారతదేశము నా మాతృభూమి కాదు: వారందరూ నా సహోదరులు కాదు..: కొత్త తరహా ప్రతిజ్ఙ
తిరువనంతపురం: భారతదేశము నా మాతృభూమి..భారతీయులందరు నా సహోదరులు..నేను నా దేశమును ప్రేమించుచున్నాను.. సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము..- ఇదీ ఇప్పటిదాకా మనం చదువుకున్న ప్రతిజ్ఙ. ప్రతి పాఠ్య పుస్తకం మొదటి పేజీ తిప్పగానే కనిపించే ఈ వ్యాక్యాలకు సరికొత్త అర్ధాన్ని ఇస్తోంది భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ). భారతదేశము నా మాతృభూమి కాదు.. ఈ భయానక పౌరులందరూ నా సహోదరులు కాదు.. నేను దేశమును ప్రేమించడం లేదు.. అంటూ బహిరంగంగా ప్రకటనలను గుప్పించింది.

రెండు జిల్లాల్లో వేర్వేరు పోస్టర్లు..
కేరళలో చోటు చేసుకున్న ఘటన ఇది. కేరళలోని కన్నూర్, పాలక్కాడ్ జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల వద్ద దీనికి సంబంధించిన పోస్టర్లను అతికించారు. కన్నూర్ జిల్లాలోని థలస్సేరిలో గల ప్రభుత్వ బ్రెన్నెన్ కళాశాల, పాలక్కాడ్ జిల్లాలోని మళంపుజ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ) వద్ద ఈ తరహా కొత్త ప్రతిజ్ఙలతో కూడిన పోస్టర్లు వెలిశాయి. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటిదాకా ఎవరినీ అరెస్టు చేయలేదని తెలుస్తోంది.

పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్థించే వారిని ఉద్దేశించి..
పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్థించే వారిని దృష్టిలో ఉంచుకుని ఎస్ఎఫ్ఐ నాయకులు ఈ పోస్టర్లను అతికించినట్లు చెబుతున్నారు. దేశ రాజధానిలోని ఈశాన్య ప్రాంతంలో కొద్ది రోజులుగా చెలరేగుతున్న హింసాత్మక వాతావరణం, అల్లర్లకు నిరసనగా ఈ రెండు జిల్లాల ఎస్ఎఫ్ఐ నాయకులు ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈశాన్య ఢిల్లీలో కొద్దిరోజులుగా చెలరేగుతున్న హింసాకాండ సందర్భంగా 42 మంది మరణించిన ఉదంతం పట్ల ఇప్పటికే కేరళ ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన కార్యక్రమాలను నిర్వహించారు.

సుమోటోగా తీసుకున్న పోలీసులు..
ఈ పోస్టర్ల వ్యవహారం కేరళలో చర్చనీయాంశమైంది. కలకలానికి దారి తీసింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే పోలీసులు సుమోటోగా కేసును నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్153 కింద కేసు నమోదు చేసినట్లు కన్నూర్, పాలక్కాడ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్లు వేర్వేరుగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటిదాకా ఎవ్వర్నీ అరెస్టు చేయలేదని, నిందితుల కోసం ఆరా తీస్తున్నామని తెలిపారు. బ్రెన్నెన్ కళాశాల, మళంపుజలోని ప్రభుత్వ ఐటీఐ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పేర్కొన్నారు.

పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా..
దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా కేరళ ప్రభుత్వం మొదటి నుంచీ వ్యతిరేకతను ప్రదర్శిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చట్టాన్ని తాము అమలు చేయబోవట్లేదంటూ అసెంబ్లీలో తీర్మానం చేసిన మొదటి రాష్ట్రంగా గుర్తింపు పొందింది. కేరళలో అధికారంలో ఉన్నది వామపక్షాల సారథ్యంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) కావడం.. ఎస్ఎఫ్ఐ వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘం కావడం పట్ల పోలీసులు..ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications