వాణిజ్యం నా రక్తంలోనే: మోడీ, టోక్యో డిక్లరేషన్‌పై సైన్
టోక్యో: తాను గుజరాతీనని.. వాణిజ్యం అనేది తన రక్తంలోనే ఉందని భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. వ్యాపారులకు కావాల్సింది రాయితీలు కాదని, ప్రోత్సాహక వాతావరణమని మోడీ అన్నారు. జపాన్ పర్యటనలో మూడో రోజైన సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ బిజీ బిజీగా గడిపారు. ఉదయమే ఆయన జపాన్‌లోని ప్రధాన పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు.
తన కార్యాలయంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని, జపాన్ నుంచి వచ్చిన ప్రతిపాదనలను సత్వరం పరిష్కరిస్తామని ఆయన వారికి తెలిపారు. ఈ బృందంలో ఇద్దరు జపానువారికీ అవకాశం ఇవ్వనున్నట్లు మోడీ చెప్పారు. కాగా, జపాన్ వచ్చే ఐదేళ్లలో భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టనుంది. 35 బిలియన్ డాలర్ల ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు పెట్టనుంది. భారత్‌కు ఆర్థిక, సాంకేతిక సాయం చేసేందుకు జపాన్ అంగీకరించింది. టోక్యో డిక్లరేషన్‌పై భారత్, జపాన్‌లు సంతకాలు చేశాయి.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. జపాన్-భారత్ బంధం ఎంతో ప్రాచీనమైనదని అన్నారు. ఇరుదేశాల బంధాన్ని మరింత తీసుకెళ్లాలని అన్నారు. జపాన్-భారత్ బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు. భారత్, జపాన్‌లు శాంతికాముక దేశాలని చెప్పిన ఆయన, భవిష్యత్ కాలంలో ఈ రెండు దేశాలు ప్రపంచ శక్తిగా తయారవుతాయని తెలిపారు. అనేక సమయాల్లో జపాన్ చేసిన సహాయాన్ని మరువలేమని చెప్పారు. జపాన్‌తో సంబంధాలకు భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. భారత్-జపాన్ దేశాల స్నేహం కాలపరీక్షకు నిలిచిందని అన్నారు.

జపాన్‌లో భారతదేశం, భారతీయుల పట్ల ఉన్న అభిమానం ఎంతో ఆనందం కలిగించిందని మోడీ తెలిపారు.
ఇరుదేశాల మధ్య వ్యాపార బంధాలు ప్రపంచానికి మార్గదర్శనం కావాలని అన్నారు. రాబోయే కాలంలో భారత్, జపాన్ దేశాలు అన్ని రంగాల్లో ముందుంటాయని చెప్పారు. ప్రస్తుతం జరిగిన సమావేశంతో భవిష్యత్ భాగస్వామ్యంపై విశ్వాసం కలిగిందని అన్నారు.
జపాన్-భారత్‌లది కేవలం ఆర్థిక బంధమే కాదని అన్నారు. శాంతి, అహింస, బుద్ధ భగవానుడి స్ఫూర్తితో ఇరుదేశాలు పని చేస్తున్నాయని చెప్పారు. 21వ శతాబ్ధం ఆసియా దేశాలేదనని చెప్పిన మోడీ.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అతి పెద్ద భారత ఆర్థిక వ్యవస్థతో జపాన్ భాగస్వామ్యానికి ప్రాముఖ్యత ఉందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇరు దేశాలు మరో ముందడుగు వేశాయన్నారు.
ఈ సందర్భంగా జపాన్ ప్రధాని షింజో అబె మాట్లాడుతూ.. మహిళా సంక్షేమానికి జపాన్, భారత్ పరస్పరం సహకరించుకుంటాయని అన్నారు. నేటి సమావేశంలో ప్రజా సంక్షేమం, దేశ రక్షణ, ఆర్థికాంశాలపై చర్చించామని తెలిపారు. భారత్-జపాన్‌ల బంధం మరింత పెరగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications