దేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్: ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ తన రెండ్రోజుల మహారాష్ట్ర పర్యటనలో భాగంగా బుధవారం నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మొదటి దశను లాంఛనంగా ప్రారంభించారు. నవీ ముంబై చేరుకున్న వెంటనే ప్రధాని మోదీ నూతనంగా నిర్మించిన ఈ విమానాశ్రయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముంబైలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు. దాదాపు రూ.19,650 కోట్ల భారీ వ్యయంతో నిర్మితమైన ఈ ప్రాజెక్ట్ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ పౌరులకు ఇది ఒక గొప్ప కానుక.

విమానాశ్రయ తనిఖీ.. పిల్లలతో ముచ్చట
నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు(NMIA) ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ విమానాశ్రయం నిర్మాణాన్ని, అందుబాటులోకి వచ్చిన మొదటి దశ సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు అక్కడికి వచ్చిన ప్రత్యేక పిల్లలతో ఆయన ఆప్యాయంగా మాట్లాడారు. వారిని ఆప్యాయంగా పలకరించి, వారితో కొంత సమయం గడిపారు.

India Largest Greenfield Airport Inaugurated by PM Modi in Navi Mumbai

NMIA ప్రత్యేకతలు ఏమిటి?
నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (NMIA) అనేది ఇండియాలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం. ఇది ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) కింద నిర్మించబడింది. ఇది ముంబైలోని ఇప్పటికే ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CSMIA) కంటే రెండు రెట్లు పెద్దది.
ఈ అత్యాధునిక విమానాశ్రయం 1160 హెక్టార్లలో విస్తరించి ఉంది. దీనిని ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన విమానాశ్రయాలలో ఒకటిగా రూపొందించారు. ఇది అనేక దశల్లో నిర్మితమవుతోంది. పూర్తిగా ప్రారంభమైన తర్వాత నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సంవత్సరానికి 9 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తుంది.

అత్యాధునిక మౌలిక సదుపాయాలు:
పెద్ద వాణిజ్య విమానాలను నిర్వహించడానికి 3,700 మీటర్ల పొడవైన రన్‌వే ఇందులో ఉంది. మోడరన్ ప్యాసింజర్ టెర్మినల్, అడ్వాన్స్‌డ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థ ఇందులో భాగం. ఆటోమేటెడ్ పీపుల్ మూవర్ (APM) సిస్టమ్ అనే ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. ఇది విమానాశ్రయంలోని నాలుగు టెర్మినల్‌లను కలిపి ప్రయాణికులను సులభంగా తరలిస్తుంది.

పర్యావరణ అనుకూలత, కనెక్టివిటీ:
నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంది. ఇందులో 47 మెగావాట్ల సౌరశక్తి ఉత్పత్తి, సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (SAF) నిల్వ సౌకర్యాలు, ఈవీ బస్సు కనెక్టివిటీ వంటి సదుపాయాలు ఉంటాయి. ఈ విమానాశ్రయం దేశంలోనే మొట్టమొదటిసారిగా వాటర్ ట్యాక్సీ సేవతో అనుసంధానం కావడం మరో ప్రధాన విశేషం. నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను అందించనుంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో, ఆకాశ ఎయిర్ వంటి ఎయిర్‌లైన్స్ ఇప్పటికే నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి వివిధ దేశీయ నగరాలకు విమాన సేవలు ప్రారంభించనున్నట్లు ప్రకటించాయి.

ఈ ప్రాజెక్ట్‌లో అదానీ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌కు 74 శాతం వాటా ఉండగా.. సిడ్కో (CIDCO)కు 26 శాతం వాటా ఉంది. ఈ నూతన విమానాశ్రయం ప్రారంభంతో ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో విమాన ప్రయాణ సామర్థ్యం గణనీయంగా పెరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+