రెండు వేర్వేరు కరోనా వ్యాక్సిన్ డోసులు సాధ్యమేనా ? త్వరలో ట్రయల్స్-ప్రయోజనాలివే
భారత్‌లో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కుదిపేస్తున్న వేళ వ్యాక్సిన్ల కొరత ప్రభుత్వాల్నివేధిస్తోంది. వ్యాక్సిన్ తయారీ సంస్ధలు వేర్వేరు కావడం, వాటి ఫార్ములా, కంపోజిషన్ వేరుగా ఉండటం, ఇతరత్రా కారణాలతో తొలి డోస్ ఏ వ్యాక్సిన్ వేయించుకుంటే రెండో డోస్ కూడా అదే వ్యాక్సిన్ వేయించుకోక తప్పని పరిస్ధితి ఎదురవుతోంది. దీంతో వ్యాక్సిన్ తయారీ సంస్ధల సంఖ్య పెరుగుతున్నా డోసులు మాత్రం అందుబాటులోకి రావడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం రెండు వేర్వేరు కరోనా డోసుల్ని ఇవ్వడం వల్లే ప్రయోజనాలు, నష్టాలపై ట్రయల్స్ నిర్వహించబోతోంది.

దేశంలో వ్యాక్సిన్ల కొరత
దేశవ్యాప్తంగా ప్రస్తుతం మూడు కరోనా వ్యాక్సిన్ తయారీ సంస్ధలు మాత్రమే టీకాలు అందిస్తున్నాయి. వీటిలో కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వీకు మాత్రమే కేంద్రం ఇప్పటివరకూ అనుమతులు ఇచ్చింది. అయితే ఈ టీకాల్లో ప్రతీదీ రెండు సేమ్ డోసులు ఇవ్వక తప్పని పరిస్ధితి. కానీ ఈ వ్యాక్సిన్లు ఉత్పత్తి కావాలంటే కనీసం మూడు నెలల సమయం పడుతోంది. దీంతో ఓ వ్యాక్సిన్ తొలిడోస్ తీసుకున్న వారికి నిర్ణీత సమయంలో అదే వ్యాక్సిన్ రెండో డోస్ దొరుకుతుందా అంటే గ్యారంటీ లేదు. దీంతో భిన్న డోసులపై చర్చ మొదలైంది.

వేర్వేరు డోసులతో ఏం జరుగుతుంది ?
కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ ఓ వ్యాక్సిన్, రెండో డోస్ మరో వ్యాక్సిన్ తీసుకుంటే ఏమవుతుందనే చర్చ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాగుతోంది. రెండూ కరోనా నిరోధానికే, రోగనిరోధకశక్తి పెంచడానికే అయినప్పుడు వేర్వేరు డోసులతో నష్టమేంటనే వాదన వినిపిస్తోంది. అయితే ఆ రెండు డోసుల ఫార్ములాలు వేర్వేరు కావడంతో వీటిని తీసుకున్న వారిపై అవి ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతాయో తెలియని పరిస్ధితి. దీంతో రెండు డోసులూ ఒకే వ్యాక్సిన్ తీసుకోవాలనే వాటి తయారీ సంస్ధలు చెప్తున్నాయి. దీంతో జనానికి చుక్కలు కనిపిస్తున్నాయి.

భిన్న డోసులపై త్వరలో ట్రయల్స్
ఓ సంస్ధ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ రెండు డోసుల స్ధానంలో రెండు వేర్వేరు వ్యాక్సిన్లను ప్రయోగిస్తే రోగిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉంటుందనే దానిపై ట్రయల్స్ నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్ధితుల్లో రెండు వేర్వేరు వ్యాక్సిన్లు అందించడం సులువు. దీంతో రెండు వేర్వేరు డోసుల్ని ఇవ్వడం ద్వారా ఎదురయ్యే ప్రభావాలపై ట్రయల్స్ నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు జాతీయ కోవిడ్ టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ వీకే పౌల్ తెలిపారు. ఇందుకోసం తయారీ సంస్ధలతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.

భిన్న డోసులతో ప్రయోజనాలివే
ఓ వ్యక్తికి రెండు వేర్వేరు కరోనా వ్యాక్సిన్లు వేయగలిగితే మాత్రం చాలా ప్రయోజనాలు ఉంటాయని జాతీయ కోవిడ్ టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ వీకే పౌల్ తెలిపారు. ప్రస్తుతం వ్యాక్సిన్ల కొరత ఎదుర్కొంటున్న పరిస్ధితుల్లో ఇలా భిన్న వ్యాక్సిన్లు వేయడం ద్వారా కొరత తీర్చవచ్చని ఆయన చెప్తున్నారు. అలాగే భిన్న వ్యాక్సిన్ డోసుల వల్ల అవి రోగిపై పనిచేసే తీరులోనూ సానుకూల ప్రభావాలు ఉండొచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవే ప్రయోగాలు జరుగుతున్నాయని, కాబట్టి భారత్‌లోనూ వీటిపై ప్రయోగాలు చేస్తామన్నారు. ఇలా భిన్నడోసులు ఇవ్వడం వల్ల కరోనా నుంచి దీర్ఘకాలిక రక్షణ కూడా ఉంటుందని భావిస్తున్నామన్నారు.
-
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'? -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications