• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత్‌లో మరోసారి విజృంభించనున్న కరోనా మహమ్మారి: శాస్త్రవేత్తల హెచ్చరిక, ఎప్పుడంటే?

|

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తిపై తాజాగా శాస్త్రవేత్తల అంచనా మరింత ఆందోళనకు గురిచేసేదిగా ఉంది. ప్రస్తుతం భారతదేశంలో విజృంభిస్తున్న కరోనావైరస్.. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత కాస్త స్థిరంగా మారొచ్చని లేదా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

చైనాకు రిలీఫ్-ట్రంప్‌కు షాక్: కరోనావైరస్ సృష్టిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే..?

ఆ రెండు నెలల్లో మరోసారి..

ఆ రెండు నెలల్లో మరోసారి..

అయితే, జులై లేదా ఆగస్టు నెలలో తిరిగి విజృంభిస్తుందని శివ్ నాడార్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ సమిత్ భట్టాచార్య అంచనా వేశారు. ఆ రెండు నెలల్లో ఎప్పుడు, ఏ స్థాయిలో విజృంభిస్తుందనేది.. దేశ ప్రజలు పాటించే భౌతిక దూరం, దూర ప్రయాణాలపై ఆంక్షలు వంటి అంశాలే నిర్ణయిస్తాయని వెల్లడించారు.

చైనా, ఐరాపాల్లోనూ అదే పరిస్థితి..

చైనా, ఐరాపాల్లోనూ అదే పరిస్థితి..

ప్రస్తుతం వైరస్ వ్యాపిస్తున్న వేగం గతంతో పోలిస్తే బాగా నెమ్మదించిందని ప్రొఫెసర్ భట్టాచార్య తెలిపారు. అలాగే చైనా, ఐరోపా దేశాల్లో కోలుకున్న వారిలో వైరస్ మళ్లీ తిరగబెడుతున్న ఘటనలను గుర్తు చేశారు. కాబట్టి కోలుకున్నవారు పూర్తి రోగనిరోధక శక్తిని సాధిస్తున్నట్లు చెప్పలేమని అన్నారు. వీరి ద్వారానే దేశంలో రెండో విడత వైరస్ వ్యాప్తి ప్రారంభం కావొచ్చని అంచనా వేశారు.

ఆంక్షలను ఎత్తివేస్తే..

ఆంక్షలను ఎత్తివేస్తే..

కాగా, సమిత్ భట్టాచార్య అంచనాలతో ఐఐఎస్సీ బెంగళూరు ప్రొఫెసర్ రాజేష్ సుందరేశన్ ఏకీభవించారు. దేశంలో ఒకసారి సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత వైరస్ వ్యాప్తి మరోసారి తీవ్రమయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. ఆంక్షల్ని ఎత్తివేసిన తర్వాత చైనా కొంతమేర ఇలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొంటోందని చెప్పారు. ముంబైలోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చి(టీఐఎఫ్ఆర్)తో కలిసి ఐఐఎస్సీ చేసిన అధ్యయనంలో ఈ విషయాలు తేలాయన్నారు.

అప్రమత్తంగా లేకుంటే..

అప్రమత్తంగా లేకుంటే..

అంతేగాక, ఐసోలేషన్, హోంక్వారంటైన్, భౌతిక దూరం వంటి నిబంధనలు ఇంకొన్ని నెలలపాటు పాటించాల్సిన అవసరం ఉంటుందని వెల్లడైందన్నారు. ముంబై, బెంగళూరులో చేసిన అధ్యయనాన్ని బట్టి ట్రేస్, ట్రీట్ విధానాన్ని వీలైనంత వేగంగా, ఎక్కువగా చేస్తేనే ప్రజల ప్రాణాలకు ముప్పు తప్పుతుందని తెలిపారు. జులై, ఆగస్టు నెలల్లో ఫ్లూ కూడా విజృంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కాగా, దేశంలో శుక్రవారం నాటికి దేశంలో 718 మరణాలు చోటు చేసుకోగా, 23,077 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొదటిసారి మార్చి 25న దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించగా, మరోసారి మే 3 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.

  Lockdown : PM Narendra Modi Interacted With Village Panchayats Via Video Conference

  English summary
  The trajectory of COVID-19 cases could have plateaued and might even fall for some weeks after the lockdown is lifted but India is likely to see a second wave in late July or August with a surge in the number of cases during the monsoon, say scientists.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X