Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్కిల్ యూనివర్సిటీపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం: కవిత

యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల సంఖ్యపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యూనివర్సిటీలో నవంబర్, 2024 నుంచి కేవలం 920 మంది విద్యార్థులు మాత్రమే శిక్షణ కోసం పేరు నమోదు చేసుకున్నారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తప్పుడు లెక్కలను యూనివర్సిటీ వెబ్ సైట్ లో ప్రచురిస్తోందని మండిపడ్డారు.

మార్చి 20, 2026 నాటికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల సంఖ్య 68,680గా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు లెక్కల్ని ఆ యూనివర్సిటీ వెబ్ సైట్ లో ప్రచురిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్ అయ్యారు. ఈ మేరకు యూనివర్సిటీ వెబ్ సైట్ లో తప్పుడు సమాచారాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్న వేళ వెబ్ సైట్ ను పూర్తిగా ప్రక్షాళన చేసినట్లు స్పష్టం అవుతోంది. మార్చి 21, 2026 నాటికి వెబ్ సైట్ లో 1000 మంది విద్యార్థులు అలాగే 68,935 మంది లెర్నర్స్ సందర్శించినట్లు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ(YISU)ప్రచురిస్తోంది.

ఇదే విషయంపై తెలంగాణ జాగృతి నుంచి స్పష్టమైన సందేశం వచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తి విశ్వాసం, సమగ్రతతో పనిచేయాలని వివరించింది. వెబ్ సైట్స్ లో తప్పుడు లెక్కలతో కోట్ల మంది ప్రజలను తప్పుదారి పట్టించడం సమంజసం కాదని అభిప్రాయపడింది. ఈ మేరకు ఇలాంటి విషయాల్లో తెలంగాణ జాగృతి ప్రజల తరఫున పోరాటం చేస్తుందని స్పష్టం చేసింది. మరోవైపు ఇదే విషయంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన అధికారిక ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేశారు.

Kavitha Slams False Enrollment Numbers Young India Skill University Strong Attack SkillUniversity

అలాగే రాష్ట్రంలో కేవలం 13వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసి 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పుకోవడం ఈ ప్రభుత్వానికే చెల్లిందని కవిత ధ్వజమెత్తారు. తాము ప్రజా బడ్జెట్ లో లేవనెత్తిన కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలు ఈ బడ్జెట్ లో పెట్టలేదని పేర్కొన్నారు. ఈ మేరకు మైనార్టీలు, దివ్యాంగుల సంక్షేమానికి ఆశించిన స్థాయిలో బడ్జెట్ లో కేటాయింపులు లేవని తెలిపారు. బడ్జెట్ లో కేటాయింపులు చేయకున్నా.. అవకాశం దక్కని రంగాలకు రివైజ్డ్‌ ఎస్టిమేట్స్ లో ప్రాధాన్యత ఇవ్వచ్చని డిమాండ్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+