వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లో కొనసాగుతున్న తీవ్రత - 24 గంటల్లో 2.51 లక్షల కేసులు : 15.88 శాతం పాజిటివిటీ రేటు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత కంటిన్యూ అవుతోంది. కొత్త సంవత్సరం ఆరంభం నుంచి మొదలైన కరోనా కేసుల తీవ్రత రోజు రోజుకీ పెరుగుతోంది. మూడు లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. క్రమేణా తగ్గి రెండున్నార లక్షలకు చేరాయి. 24 గంటల వ్యవధిలో.. 2,51,209 కేసులు నమోదయ్యాయి. అయితే క్రితం రోజుతో పోలిస్తే ఈ సంఖ్య కాస్త తక్కువే. వైరస్​తో మరో 627 మంది మరణించారు. 3,47,443 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 15.88 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

పెరుగుతున్న పాజిటివిటీ రేటు

పెరుగుతున్న పాజిటివిటీ రేటు

దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,06,22,709 కాగా, ‬మొత్తం మరణాల సంఖ్య 4,92,327గా నమోదైంది. ఇక, ప్రస్తుతం యాక్టివ్ కేసులు 21,05,611 గా ఉందగా, కోలుకున్న వారి సంఖ్య 3,80,24,771 గా రిజిస్టర్ అయింది. భారత్​లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే 57,35,692 డోసులు అందించారు.

ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,64,44,73,216కు చేరింది.కేరళలో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. ఒక్కరోజే 51,739 కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 58.26 లక్షలు దాటింది. మరో 68 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 52,343కి పెరిగింది. కర్ణాటకలో కరోనా కేసులు క్రితం రోజుతో పోల్చుకుంటే భారీగా తగ్గాయి.

విద్యా సంస్థల తిరిగి ప్రారంభం

విద్యా సంస్థల తిరిగి ప్రారంభం

తాజాగా 38,083 కేసులు వెలుగుచూశాయి. మరో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా 67,236 మంది వైరస్​ను జయించారు. దీంతో యాక్టివ్​ కేసుల సంఖ్య 3,28,711కు చేరింది. పాజిటివిటీ రేటు 20.44కు చేరింది. బెంగళూరులో ఒక్క రోజే 185 మంది ఒమిక్రాన్​ బారినపడ్డారు. ఫలితంగా నగరంలో మొత్తం ఒమిక్రాన్​ బాధితుల సంఖ్య 1,115కు చేరింది. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో భౌతిక తరగతులు పునః ప్రారంభించనున్నట్టు వెల్లడించింది.

రాత్రిపూట కర్ఫ్యూను ఎత్తివేసినట్లు స్పష్టం చేసింది. వివాహ వేడుకలకు 100 మంది, అంత్యక్రియలకు 50మందికి మించరాదని నిబంధన విధించింది.ప్రార్థనా స్థలాలు అన్ని రోజుల్లోనూ తెరిచే ఉంటాయని స్పష్టంచేసింది. రెస్టారెంట్లు, సెలూన్లు, సినిమా థియేటర్లు, జిమ్‌లు, యోగా సెంటర్లకు మాత్రం 50శాతం ఆక్యుపెన్సీతోనే నిర్వహించుకోవాలని ప్రభుత్వం సూచించింది.

Recommended Video

COVID-19 పేషెంట్స్ హోమ్ ఐసోలేషన్ గైడ్ లైన్స్ | Arogya Setu App | Oneindia Telugu
కేసులు పెరిగినా.. ఆందోళన వద్దంటూ

కేసులు పెరిగినా.. ఆందోళన వద్దంటూ

మరోవైపు రాష్ట్రంలో కొత్తగా 28,515 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 53 మంది చనిపోయారు. దిల్లీలో కరోనా కేసుల సంఖ్యంగా గణనీయంగా తగ్గింది. తాజాగా 4,921 కేసులు బయటపడగా.. మరో 34 మంది మరణించారు. 9,397 మంది వైరస్​ను జయించారు. ఫలితంగా యాక్టివ్​ కేసుల సంఖ్య 33,175కు తగ్గింది. పాజిటివిటీ రేటు 9.56 శాతానికి చేరింది.

మహారాష్ట్రలో రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల నమోదైంది. కొత్తగా 25,425 మందికి వైరస్​ సోకగా.. 42 మంది మరణించారు. 36,708 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. ఫలితంగా యాక్టివ్ కేసుల సంఖ్య 2,87,397కు చేరింది. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కొవిడ్‌ ఆంక్షల్ని సడలించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. ఇంటిటా ఫీవర్ సర్వే కొనసాగుతోంది. ఏపీలో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం జగన్ కరోనా పరిస్థితుల పైన సమీక్ష నిర్వహించారు. కీలక సూచనలు చేసారు.

English summary
India recorded 2,51,209 new Covid-19 cases in the last 24 hours,daily positivity rate stands at 15.88 per cent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X