వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లో కరోనా రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ .. తాజాగా 39,361 కొత్త కేసులు, 416 మరణాలు

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా మహమ్మారి కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 39,361 కరోనా కొత్త కేసులను నమోదు చేసింది. ఇది నిన్నటి రోజువారీ కేసులో లెక్క కంటే కాస్త తక్కువగానే ఉంది. భారతదేశం 24 గంటల వ్యవధిలో 416 మరణాలను నివేదించింది. నిన్న రోజు వారి మరణాలు 535 నమోదయ్యాయి. గత 24 గంటల్లో 11,54,444 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లుగా ఐ సి ఎం ఆర్ గణాంకాలు వెల్లడించాయి.

ఆగస్టులో కరోనా థర్డ్ వేవ్, భారతదేశంలో రోజుకు 1 లక్ష కేసుల నమోదుకు అవకాశం : ఐసిఎంఆర్ఆగస్టులో కరోనా థర్డ్ వేవ్, భారతదేశంలో రోజుకు 1 లక్ష కేసుల నమోదుకు అవకాశం : ఐసిఎంఆర్

గడచిన 24 గంటల్లో మరణించిన 416 మంది తో కలిపి, మొత్తంగా దేశవ్యాప్తంగా సంభవించిన కరోనా మరణాలు 4,20,967. ఇదిలా ఉంటే దేశంలో నిన్ను ఒక్క రోజు 35,960 మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు . దీంతో ఇప్పటి వరకు దేశంలో 3.05 కోట్లమంది కరోనా మహమ్మారి బారినుండి బయటపడినట్లుగా సమాచారం. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసులు 3.4 కోట్లకు చేరుకున్నాయి.

India records 39,361 new Covid-19 cases, 416 deaths in 24 hours, new cases more than recoveries

Recommended Video

Covid-19 Third Wave Likely In August India To See 1 Lakh Cases Daily Says ICMR Scientist

దేశంలో క్రియాశీల కేసులు విషయానికి వస్తే 4.11 లక్షలకు క్రియాశీల కేసులు చేరుకున్నాయి. ప్రస్తుతం క్రియాశీల కేసుల రేటు 1.31 గా ఉంది. రికవరీ రేటు 97.35 శాతంగా ఉంది. అయితే ఇటీవల కాలంలో రికవరీల కంటే కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్న తీరు ఇండియాను ఆందోళనకు గురి చేస్తోంది.ఒక రోజులో 17,466 కేసులతో కేరళ ఒక రోజులో అత్యధిక కొత్త కేసులను నమోదు చేసి అన్ని రాష్ట్రాలలోనూ ముందుంది. ఇది 66 మరణాలను కూడా నివేదించింది. మొత్తంమీద అత్యధిక కేసులతో మహారాష్ట్ర చెత్తగా దెబ్బతిన్న రాష్ట్రంగా ఉంది. ఇది గత 24 గంటల్లో 6,843 కేసులు ,123 మరణాలను మహారాష్ట్ర నమోదుచేసింది.

ఇక దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18.99 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ డోసులను ఇచ్చారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా పంపిణీ అయిన టీకా డోసులు మొత్తం 43,51 ,96,001 గా ఉన్నాయి. దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తర ప్రదేశ్‌లో గత 24 గంటల్లో కేవలం మూడు కేసులు, కరోనావైరస్ కారణంగా ఒక మరణం సంభవించాయి. పంజాబ్ ప్రభుత్వం ఈ రోజు నుండి 10, 11 మరియు 12 తరగతులకు పాఠశాలలను తిరిగి తెరవడానికి అనుమతించింది. ఇదిలా ఉంటే గోవా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ ఉత్తర్వులను ఆగస్టు 2 వరకు పొడిగించింది.

English summary
India today added 39,361 fresh coronavirus cases, which is marginally lower than yesterday's count. The country also reported 416 deaths over a 24-hour period; it had reported 535 deaths a day ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X