వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ విలయం .. గత 24 గంటల్లో 1,31,968 కొత్త కేసులు ,780 మరణాలు

|
Google Oneindia TeluguNews

సైంటిస్ట్ లు , నిపుణులు హెచ్చరించినట్టే భారతదేశంలో కరోనా మహమ్మారి ప్రళయం సృష్టిస్తోంది. విపరీతంగా విరుచుకుపడుతోంది. తాజాగా నమోదవుతున్న రోజువారీ కేసులు భారతదేశ స్థితిని అత్యంత దారుణంగా తయారు చేస్తోంది. తాజాగా భారతదేశంలో 1,31,968 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో భారతదేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.3 కోట్లకు చేరుకుంది.

 corona cases in AP : భారీగా పెరిగిన కేసులతో కరోనా టెన్షన్ .. నిన్న ఒక్కరోజే 2,558 కేసులు corona cases in AP : భారీగా పెరిగిన కేసులతో కరోనా టెన్షన్ .. నిన్న ఒక్కరోజే 2,558 కేసులు

 గత 24 గంటల్లో 780 మంది మృతి

గత 24 గంటల్లో 780 మంది మృతి


దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. భారతదేశం లక్షకు పైగా కొత్త కేసులను నమోదు చేయడం గత ఐదు రోజుల్లో ఇది నాలుగవ సారి. భారతదేశంలో కరోనా మహమ్మారి తో 1,67,642 మంది మరణించగా, గత 24 గంటల్లో 780 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, బ్రెజిల్ తరువాత భారతదేశం కరోనా కేసుల నమోదులో మూడవ స్థానంలో ఉంది.

కరోనా కేసుల పెరుగుదలతో నేడు భారతదేశ క్రియాశీల కేసులు మొత్తం లెక్కలో 9,79,608 గా ఉన్నాయి.

 దేశంలో విపరీతంగా పెరుగుతున్న యాక్టివ్ కేసుల సంఖ్య , 7.04 శాతం

దేశంలో విపరీతంగా పెరుగుతున్న యాక్టివ్ కేసుల సంఖ్య , 7.04 శాతం

దేశంలో యాక్టివ్ కేసులు 7.04 శాతంగా ఉన్నాయి. ఫిబ్రవరిలో, రోజువారీ కేసులు తగ్గుదలతో క్రియాశీల కోవిడ్ -19 కేసుల సంఖ్య కనిష్ట స్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి 12 న, 1,35,926 క్రియాశీల కోవిడ్ -19 కేసులు ఉన్నాయి. ఇది మొత్తం కేసుల సంఖ్యలో 1.25 శాతంగా ఉన్నాయి. ఒక రెండు నెలల వ్యవధిలోనే, 7.04 శాతంగా భారతదేశ క్రియాశీలక కేసుల సంఖ్య పెరిగింది.

గత 24 గంటల్లో 61,899 మంది రోగులు డిశ్చార్జ్ అయినందున దేశంలో ఒకే రోజు రికవరీలు కూడా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1, 19,13,292 కు చేరుకుంది.

ప్రధాని మోడీ సీఎం లతో భేటీ .. పరీక్షల పెంపుకు సూచన

ప్రధాని మోడీ సీఎం లతో భేటీ .. పరీక్షల పెంపుకు సూచన

నియంత్రణ చర్యలు కఠినతరం చేస్తున్న సమయంలో కేసుల పెరుగుదల కనిపిస్తుంది . ఇప్పటికే అనేక రాష్ట్రాలు మినీ-లాక్‌డౌన్లు, నైట్ కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్లు మొదలైనవి ప్రకటించాయి.

మహమ్మారి యొక్క రెండవ తరంగం యొక్క వక్రత క్రమంగా పెరుగుతున్నందున, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం ముఖ్యమంత్రుల సమావేశాన్ని నిర్వహించి, సానుకూల కేసుల సంఖ్యను చూసి ఆందోళన పడవద్దు అని, కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత పెంచాలని ప్రభుత్వాలకు సూచించారు .

Recommended Video

#Coronavirusinindia : PM Modi Gets Second Vaccine Dose ఈసారీ సైలెంట్‌గా కానిచ్చిన మోదీ !!
మైక్రో కంటెంట్మెంట్ జోన్స్ ఏర్పాటుపై దృష్టి, మహాలో కరోనా విలయం

మైక్రో కంటెంట్మెంట్ జోన్స్ ఏర్పాటుపై దృష్టి, మహాలో కరోనా విలయం

ఒకరికి కరోనా వస్తే 30 మందిని ట్రేస్ చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. భారీ సంఖ్యలో టెస్టులు చేయాలని సూచించారు. మైక్రో కంటెంట్మెంట్ జోన్స్ ఏర్పాటుపై దృష్టి కేంద్రీకరించాలని, అయినప్పటికీ లాక్డౌన్ ఉండబోదని, సమస్య తీవ్రంగా ఉన్న చోట మాత్రమే కరోనా కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాలకు సూచించారు.
ఇక దేశంలో అత్యంత దారుణమైన స్థితిలో మహారాష్ట్రలో కరోనా మహమ్మారి పంజా విసురుతుంది .

English summary
India on Friday reported a single-day spike of 1,31,968 new Covid-19 cases, taking the total infection tally to 1,30,60,542, while the number of active cases has now been pushed to 9,79,608. This is the fourth time India's 24-hour tally breached the 1-lakh mark.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X