వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియాలో మొదటి చైల్డ్ కేసు: కేరళలో మూడేళ్ళ చిన్నారికి కరోనా

|
Google Oneindia TeluguNews

చైనా మాత్రమే కాదు ప్రపంచంలోని పలు దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇటు మన దేశంలోనూ వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం కరోనా వైరస్ కంట్రోల్ చెయ్యటానికి నానా తంటాలు పడుతుంది . ఇక ఈ నేపధ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ వైద్య శాఖాధికారులు అలెర్ట్ అయ్యారు అయినప్పటికీ కేరళ వంటి రాష్ట్రాల్లో కరోనా ప్రభావం చూపిస్తుంది.

Recommended Video

Coronavirus In India: Total Cases 43 Including 3 Year Old, First Child In India | Oneindia Telugu
 కేరళ రాష్ట్రంలో నలభైకి చేరిన కరోనా కేసులు

కేరళ రాష్ట్రంలో నలభైకి చేరిన కరోనా కేసులు

భారతదేశంలో కేరళలో కరోనావైరస్ యొక్క మొట్టమొదటి కేసు కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యింది. ఇక తాజాగా ఒక కుటుంబంలో ఐదుగురు కరోనా బారిన పడిన పరిస్థితి ఉంది. గడచిన నాలుగు రోజుల్లో కరోనా బాధితుల సంఖ్య పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది.ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిలో కరోనా వైరస్ ఉన్నట్టు గుర్తించిన అధికారులు ఇప్పుడు మరో కేసును కేరళ రాష్ట్రంలో గుర్తించారు. నిన్నటికి దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 39కి చేరింది. ఇక నేడు నమోదైన కేసుతో కలిపి రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 40కి చేరింది .

మూడేళ్ళ చిన్నారికి కరోనా వైరస్

మూడేళ్ళ చిన్నారికి కరోనా వైరస్

ఇన్ని రోజులుగా చిన్నపిల్లలపై కరోనా వైరస్ ప్రభావం ఉండదని అంతా భావించారు. కానీ, కరోనా వైరస్ ఇప్పుడు చిన్నారులను కూడా వదలకుండా ప్రతాపం చూపిస్తోంది. ఇక తాజాగా కేరళలో మూడేళ్ల చిన్నారికి కరోనా వైరస్‌ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం వైద్య కళాశాలలో వైద్యులు చిన్నారిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి, చికిత్స అందిస్తున్నారు.

భారతదేశంలో మొదటి చైల్డ్ కరోనా కేసు

భారతదేశంలో మొదటి చైల్డ్ కరోనా కేసు

చిన్నారి కుటుంబం ఇటీవలే ఇటలీలో పర్యటించి వచ్చినట్లుగా తెలుస్తోంది. చిన్నారి జలుబుతో బాధపడుతుండడంతో ఆమె తల్లిదండ్రులు వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు పరీక్షలు నిర్వహించడంతో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇటలీ పర్యటనలోనే చిన్నారికి కరోనా సోకినట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది భారత్‌లోనే ఫస్ట్ చైల్డ్‌ కరోనా కేసుగా అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో చిన్నారికి చికిత్స చేస్తున్నారు.

English summary
Doctors have confirmed that the coronavirus has infected a three year old child in Kerala. Doctors at the Ernakulam Medical College in the state of Kerala are placed in the Isolation Ward. The infant family seems to have recently toured Italy. Her parents brought the child to the hospital for medical tests after the child was diagnosed cold . Corona turned out to be positive as doctors were examining it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X