వెంటవెంటనే 2సార్లు: పృథ్వీ2 క్షిపణి పరీక్ష సక్సెస్
స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన అణ్వాయుధ సామర్థ్యం గల పృథ్వీ-11 క్షిపణిని భారత్ సోమవారం విజయవంతంగా పరీక్షించింది
బాలాసోర్: స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన అణ్వాయుధ సామర్థ్యం గల పృథ్వీ-11 క్షిపణిని భారత్ సోమవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా చాందిపూర్‌లోని టెస్ట్ రేంజ్‌లో రెండుసార్లు ఈ క్షిపణీని వెంటవెంటనే పరీక్షించింది ఆర్మీ.
ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయాణించే ఈ క్షిపణి 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. అంతేగాక, 500 నుంచి 1000కిలోల వార్‌హెడ్స్ మోసుకెళ్లగలుతుంది.

ఈ క్షిపణికి సంబంధించి ఇలాంటి పరీక్షలు రెండింటిని 2009 అక్టోబర్ 12న విజయవంతంగా నిర్వహించారు. ఇప్పటికే ఉత్పత్తి చేసిన క్షిపణుల్లో ర్యాండమ్‌గా పృథ్వీ-11 క్షిపణిని ఎంచుకొని పరీక్షలు నిర్వహించారు.
స్ట్రాటెజిక్ ఫోర్స్ కమాండ్ (ఎస్‌ఎఫ్‌ఎస్), డీఆర్‌డీవో శాస్త్రవేత్తల పర్యవేక్షణలో శిక్షణ కసరత్తులో భాగంగా ఈ క్షిపణి పరీక్షలు నిర్వహించినట్టు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications