వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ ప్రారంభం: నీతి ఆయోగ్ సభ్యుడి కీలక ప్రకటన

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు అనేకమంది శాస్త్రవేత్తలు, ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే రష్యా తాము కరోనా వ్యాక్సిన్ విడుదల చేశామని, మొదట తమ దేశానికి, ఆ తర్వాత ప్రపంచ దేశాలకు అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజాగా నీతి ఆయోగ్ ఓ శుభవార్తను తెలిపింది. దేశంలో మూడు కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధి వివిధ దశలో ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, ఈ మూడింటిలో ఒక వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్‌కి చేరుకుందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. నేడో, రేపో మూడో దశ ట్రయల్స్ ప్రారంభమవుతాయని వెల్లడించారు.

ఇక మిగిలిన రెండు వ్యాక్సిన్లు మొదటి, రెండు దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నట్లు వీకే పాల్ తెలిపారు. కాగా, దేశంలో ఇప్పటికే భారత్ బయోటెక్, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, జైడస్ క్యాడిలాతోపాటు పలు సంస్థలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు కూడా క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి.

 India to begin phase 3 trial for COVID-19 vaccine today or tomorrow: NITI Aayog member

ఇది ఇలావుండగా, దేశంలో మూడు కోట్ల మందికిపైగా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 8,99,864 మందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 19,70 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారని చెప్పారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో యాక్టివ్ కేసులు కేవలం పావు వంతు మాత్రమే ఉన్నాయని తెలిపారు.

ప్రస్తుతం రోజుకు సగటున రికవరీ అవుతున్నవారి సంఖ్య 55వేలకు పైనే ఉందని చెప్పారు. దేశంలో మరణాల సంఖ్య కూడా 2 శాతం కంటే తక్కువగానే ఉందని రాజేష్ భూషణ్ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 73.18 శాతం ఉండగా, యాక్టివ్ కేసులు 24.91శాతం ఉందని తెలిపారు. మరణాల రేటు 1.92శాతం ఉన్నాయని వివరించారు.

కాగా, ఇప్పటి వరకు()మంగళవారం రాత్రి 9గంటల వరకు దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27,35,252కు చేరింది. 6,74,627 యాక్టివ్ కేసులున్నాయి.
20,07,783 మంది కరోనా నుంచి కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకున్నారు. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 52,334 మంది మరణించారు.

English summary
In a major breakthrough, India is set to begin phase 3 trials for an indigenously developed potential COVID-19 vaccine, NITI Aayog member VK Paul said on Tuesday. However, Paul did not reveal the name and details of the potential COVID19 vaccine candidate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X