ఆప్ దే ఢిల్లీ కార్పోరేషన్ : 149-171 సీట్లతో విజయం-ఇండియా టుడే యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్
ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎంసీడీ(MCD)కి జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ జయకేతనం ఎగరేస్తుందని ఇండియా టుడే మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. ఇవాళ సాయంత్రం ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ లో ఈ మేరకు స్పష్టం చేసింది. కాంగ్రెస్, బీజేపీ తర్వాత స్ధానాల్లో నిలుస్తున్నాయి.
ఎంసీడీలో(ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్)లో మొత్తం 250 సీట్లు ఉన్నాయి. ఇందులో అధికారం చేపట్టాలంటే ఏ పార్టీకైనా 126 సీట్లు కావాలి. తాజా ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 149-171 సీట్లు సాధించి ఎంసీడీలో తొలిసారి అధికారం చేపట్టబోతున్నట్లు ఇండియా టుడే మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ అంచనా వేస్తోంది. రెండో స్ధానంలో బీజేపీ నిలవబోతున్నట్లు ఈ ఎగ్జిట్ పోల్ నిర్దారించింది. బీజేపీకి 69-91 సీట్లు దక్కబోతున్నాయి. కాంగ్రెస్ కు ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం కేవలం 3-7 సీట్లు మాత్రమే దక్కబోతున్నాయి. ఇతరులు 5-9 సీట్లు దక్కించుబోతున్నట్లు ఎగ్జిట్ పోల్ పేర్కొంది.

ఢిల్లీలో వరుసగా మూడోసారి అధికారంలో ఉన్న ఆప్ ను ఎలాగైనా దెబ్బకొట్టేందుకు ఢిల్లీలో మూడు కార్పోరేషన్లను కలిపి ఒకే కార్పోరేషన్ గా చేస్తూ పార్లమెంటులో కేంద్రం చట్టంచేసింది. కానీ ఈసారి ఎన్నికల ఫలితాల సరళి గమనిస్తే ఆప్ ను ఇక్కడా బీజేపీ ఓడించలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఆప్ హవా ముందు బీజేపీ ఎత్తులేవీ పారలేదని ఢిల్లీ కార్పోరేషన్ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications