ఇండియా టుడే-మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే: మోడీ 4ఏళ్ల పాలన
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు, గత నాలుగేళ్లుగా వరుసగా విజయాలు సాధిస్తున్న బీజేపీ, ఉప ఎన్నికలు తదితర వాట్లలో ఓటమి బాట పట్టింది. కానీ ఇటీవల పెరుగుతున్న పెట్రో ధరలు, జీఎస్టీ, నోట్ల రద్దు వంటి కారణాలతో ప్రజలు ఒకింత ఆగ్రహంతో ఉన్నారు. భారత భవిష్యత్తు కోసమేనని బీజేపీ చెబుతున్నా వాటితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా టుడే మూడ్ ఆప్ ది నేషన్ పేరుతో సర్వే చేసింది. మోడీ పాలన ఎలా ఉంది, కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందనే అంశాలపై మనం ఓ అంచనాకు రావొచ్చు.

ఇండియా టుడే -సీఎస్‌డీఎస్ లోక్ నీతి సర్వే ప్రకారం రాజస్థాన్‌లో కాంగ్రెస్ బాగా
పుంజుకుంది. బీజేపీకి ఎదురు దెబ్బ తగలనుంది. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ ఓట్ షేర్
తగ్గనుంది. 2014లో ఎన్డీయేకు 45 శాతం వస్తే ఇప్పుడు 35 శాతం వస్తాయని తేలింది.
బీహార్‌లో జేడీయూ - బీజేపీ కూటమికి 60 శాతం ఓట్లు రానున్నాయి. 2014లో ఇది 51గా
ఉంది. యూపీఏకు 2014లో 28 శాతం ఓట్లు రాగా ఇప్పుడు 34 శాతం రానున్నాయి.
మహారాష్ట్రలో ఎన్డీయే 48 శాతం ఓట్ షేర్ పొందనుంది. యూపీఏ 2014లో 35 శాతం ఓట్
షేర్ పొందగా ఇప్పుడు 40 శాతానికి పెరగనుంది.
రాజస్థాన్‌లో బీజేపీ ఓట్ షేర్ 2014లో 45 ఉండగా, ఇప్పుడు 39 శాతానికి పడిపోయింది.
కాంగ్రెస్ ఓట్ షేర్ 33 నుంచి 44 శాతానికి పెరిగింది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications