ఉగ్రవాది అంటే ఉగ్రవాదే: పాకిస్థాన్ కు ఇచ్చి పడేసిన భారత్

ఉగ్రవాదంపై తన వైఖరిని భారత్ మరోసారి అంతర్జాతీయ వేదికగా స్పష్టం చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో భారత్ ఎలాంటి రాజీ పడదని ఐక్యరాజ్యసమితి వేదికగా తీర్మానించింది. యూనైటెడ్ నేషన్స్ గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీ 9 వ సమీక్ష సమావేశంలో ఈ మేరకు UNO లో భారత రాయబారి పర్వతనేని హరీశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా నిస్సందేహంగా ఖండించాలని పేర్కొన్నారు. టెర్రరిజం అనే హత్యాసిద్ధాంతాన్ని ప్రపంచ దేశాలు మూకుమ్మడిగా కలిసి నిర్మూలించాలని పిలుపునిచ్చారు.

" సరిహద్దు ఉగ్రవాదంపై దశాబ్దాల కాలం నుంచి భారత్ పోరాడుతోంది. ఉగ్రవాదం కారణంగా భారత ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబాలను కోల్పోయారు. సమాజం దెబ్బతింది. ఈ అనుభవాలు భారత్ ను పూర్తిగా మార్చేశాయి. టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా అణచివేయాలి. ప్రపంచదేశాలు ఉగ్రవాదం నిర్మూలనలో పాలు పంచుకోవాలి" అని UNO లో భారత రాయబారి పర్వతనేని హరీశ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై జవాబుదారీతనం ఉండాలని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించేవారు.. వెనకాల ఉంచి ప్రోత్సహించే శక్తులు, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చు వాళ్లు, ఆశ్రయం కల్పించే వారిని చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు.

" ఉగ్రవాది ఎప్పటికీ ఉగ్రవాదే.. మనమంతా చేతులు కలిపి ఈ డేంజరస్ ఉగ్రవాదాన్ని తరివేయాలి. ఉగ్రవాద వ్యాప్తికి దోహద పడే పరిస్థితులను మనం పరిష్కరించాలి. ఈ ఉగ్రవాద భావజాలాన్ని సమూలంగా నిర్మూలించాలి. మానవ హక్కులను, చట్టబద్ధమైన పాలనను మనం గౌరవించుకోవాలి. మానవుడి జీవించే హక్కుపై ఉగ్రవాదం ప్రత్యక్షదాడి చేస్తుందని భావించాలి" అని పర్వతనేని హరీశ్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం నిర్మూలనకు చేపట్టిన చర్యల్లో ఎప్పటికప్పుడు భారత్ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలంటే సభ్య దేశాల మధ్య సహకారం, పారదర్శకత తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు.

India UN Ambassador ParvathaneniHarish Reiterates Terrorist Terrorist Parvathaneni Harish

ఈ మేరకు పాకిస్థాన్ పేరెత్తకుండానే అంతర్జాతీయ వేదికగా భారత్ మరోసారి ఉగ్ర దేశానికి హెచ్చరికలు జారీ చేసింది. గతేడాది ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన మారణహోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన వెనకాల ఉన్నది పాకిస్థాన్ అని తేలడంతో ఆ దేశంపై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై దాడులకు పాల్పడింది. వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది. అప్పటినుంచి భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+