ఎవరెస్ట్: 70మంది పర్వతారోహకుల ప్రాణాలను కాపాడిన భారత వైద్యుడు

న్యూఢిల్లీ: నేపాల్‌లో శనివారం సంభవించిన భారీ భూకంపం కారణంగా ఎవరెస్ట్ వద్ద మంచు తుఫాను తలెత్తిన సమయంలో అక్కడున్న పర్వతారోహకుల ప్రాణాలను కాపాడిన భారత సైన్యానికి చెందిన వైద్యుడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రాణాలు కాపాడిన ఆయన తమ పాలిట ప్రత్యక్ష దైవంగా కనిపించాడని బాధిత పర్వతారోహకులు చెబుతున్నారు.

సుమారు 70మంది పర్వతారోహకుల బృందం భూకంప సమయంలో ఎవరెస్ట్ బేస్ క్యాంపు వద్ద ఉన్నారు. ఆ సమయంలోనే భారత సైన్యానికి చెందిన కెప్టెన్ రితేశ్ గోయల్(28).. 30మంది సభ్యుల బృందంతో కలిసి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి వెళ్లారు.

Indian Army Doctor Saves Lives on Mount Everest

ఆకస్మాత్తుగా విరుచుకుపడిన మంచుతుఫానులో బృందమంతా చెల్లాచెదురైపోయి, అనేకమంది కాళ్లూ, చేతులూ విరిగిపోయాయి. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.

కాగా, గోయెల్ స్థిర సంకల్పంతో వారందరికీ ప్రాథమిక చికిత్స అందించి వారి ప్రాణాలను నిలబెట్టాడు. హెలికాప్టర్లు వచ్చి వారిని రక్షించడానికి 14గంటలు పడితే, అంతవరకు ఆయన అందరికీ చికిత్స అందించారు. కాగా, గోయల్ గతంలో సియాచిన్ వంటి పర్వత ప్రాంతాల్లోనూ సేవలందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+