ఇండియన్ ఆర్మీకి కామికేజ్ డ్రోన్లు: శత్రువుకు గట్టి హెచ్చరిక!

ఇండియన్ ఆర్మీ గొప్ప ఘనత సాధించింది. యుద్ధ సమయంలో శత్రువుకి ముచ్చెమటలు పట్టించే సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. రక్షణ రంగం లో గణనీయమైన మార్పులు వస్తున్న ప్రస్తుత తరుణంలో, ఇండియన్ ఆర్మీ లేటెస్ట్ టెక్నాలజీ తో రూపొందించిన 'కామికేజ్' (Kamikaze) డ్రోన్లను తన అమ్ములపొదిలోకి చేర్చుకుంది. ఆత్మనిర్భర్ భారత్ స్పూర్తితో చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ డ్రోన్లు సరిహద్దుల్లో సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేయనున్నాయి.

రూ.10కోట్ల విలువైన ఒప్పందాన్ని చేసుకున్న భారత రక్షణ శాఖ

'ఇన్‌సైడ్‌ఎఫ్‌పీవీ' (InsideFPV) అనే స్టార్టప్ కంపెనీ ఈ విజయం సాధించింది. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఈ కంపెనీతో 2025 డిసెంబర్ లో భారత రక్షణ శాఖ సుమారు రూ. 10కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సాధారణంగా డిఫెన్స్ అగ్రిమెంట్లు జరిగాక, ఆయుధాలు సరఫరా చేయడానికి ఎన్నో ఏళ్ల సమయం పట్టొచ్చు.

Indian Army Inducts Kamikaze Drones Game-Changer in Modern Warfare know these drones speciality

రెండు నెలల తక్కువ వ్యవధిలోనే వందలాది కామికేజ్ డ్రోన్లు

ఈ స్టార్టప్ కంపెనీ ఆయుధాలు డిప్లాయ్ చెయ్యడానికి తీసుకున్న సమయం ఎంతో తెలుసా..? కేవలం రెండు నెలల తక్కువ వ్యవధిలోనే వందలాది కామికేజ్ డ్రోన్లను ఆర్మీకి అప్పగించి సరికొత్త రికార్డు సృష్టించి చరిత్ర పుటల్లో నిలిచిపోయింది ఈ స్టార్టప్ కంపెనీ. ఈ డ్రోన్ల ప్రత్యేకతలు చాలా విశిష్టమైనవి. చిన్నవిగా ఉంటాయి..ప్రభావం ఎలా ఉంటుంది అనే సందేహాలు ఏ మాత్రం పెట్టుకోవద్దు. ఇవి చేసే అరాచకం..విధ్వంసం చాలా ఎక్కువ.

దాదాపు 2.5 కేజీల పేలుడు పదార్థాలను మోసుకెళ్ళే డ్రోన్లు

ఈ డ్రోన్లు రికార్డు వేగంతో..గంటకు గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్తాయి. దీనివల్ల శత్రువు కోలుకునే లోపే జరగాల్సింది జరిగిపోతుంది.. శత్రువును నేలమట్టం చేస్తుంది. ఈ డ్రోన్లు దాదాపు 2.5 కేజీల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలవు. టార్గెట్ ని చేరుకున్న వెంటనే ఇవి పేలిపోయి శత్రువుకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.

10 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల స్థావరాలు, టార్గెట్ లు ధ్వంసం

సముద్ర మట్టానికి సుమారు 2.5 కిలోమీటర్లు అంటే సుమారు 2500 మీటర్లు ఎత్తు వరకు ఎగిరే సామర్ధ్యం ఈ డ్రోన్లకి ఉంది. కొండ ప్రాంతాల్లో కూడా ఇవి చాకచక్యంగా పనిచేస్తాయి.సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల స్థావరాలను , టార్గెట్లను ఇవి సులభంగా చేరుకుని ధ్వంసం చేయగలవు.

ఆత్మాహుతి డ్రోన్లు.. వీటి ప్రత్యేకత ఇదే

కామికేజ్ డ్రోన్లకు మరో పేరు కూడా ఉంది. అదే .'సూసైడ్ డ్రోన్లు'. వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా.. సాధారణ డ్రోన్లలాగా కేవలం సమాచారాన్ని మాత్రమే సేకరించి తిరిగి రావు. శత్రువుల ట్యాంకులు, బంకర్‌లు లేదా ఉగ్రవాద స్థావరాలను గుర్తించి..వాటిని లక్ష్యంగా చేసుకుని నేరుగా దూసుకెళ్లి పేల్చేస్తాయి.

గెరిల్లా యుద్ధ సమయాల్లో ఇవి గేమ్ ఛేంజర్‌

ఎంతో ఖరీదైన క్షిపణులతో (Missiles) పోలిస్తే ఈ డ్రోన్ల తయారీ ఖర్చు కూడా చాలా తక్కువే. అంతే కాదు, వీటిని ఆపరేట్ చేయడం చాలా ఈజీ మరియు ఈ డ్రోన్ల వల్ల మన జవాన్లకు ఎలాంటి ప్రాణనష్టం ఉండదు. సరిహద్దుల్లో చొరబాట్లను అడ్డుకోవడానికి మరియు గెరిల్లా యుద్ధ సమయాల్లో ఇవి గేమ్ ఛేంజర్‌గా మారతాయి.. భారత రక్షణ రంగం ఇలాంటి స్వదేశీ స్టార్టప్‌లను ప్రోత్సహించడం వల్ల భారత రక్షణ వ్యవస్థ బలోపేతం అవ్వడమే కాకుండా, ఇటు స్థానిక పరిశ్రమలకు కూడా ప్రాముఖ్యత ఇచ్చినట్టు అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+