ట్విట్టర్ లో కేంద్రం ఏజెంట్ ? యూజర్ల డేటా యాక్సెస్-మాజీ సెక్యూరిటీ ఛీఫ్ సంచలనం

అంతర్జాతీయ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ లో భారత ప్రభుత్వ ఏజెంట్ పనిచేస్తున్నారా ? అతనికి యూజర్ల డేటాను యాక్సెస్ చేసే అధికారాలు ఇచ్చారా ? భారత్ లో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెట్టే పోస్టులపై కేంద్రం ఆ విధంగా నిఘా పెట్టిందా ? అంటే అవుననే అంటున్నారు ట్విట్టర్ మాజీ సెక్యూరిటీ ఛీఫ్ పీటర్ జాట్కో.

కొన్ని నెలల క్రితం ట్విట్టర్ తన సైబర్ సెక్యూరిటీ చీఫ్ పీటర్ జాట్కోను తొలగించింది. ఇప్పుడు జాట్కో యూఎస్ లోని ఎస్ఈసీకి ఓ విస్తృతమైన విజిల్-బ్లోయర్ నివేదికను అందించారు. ఇందులో కంపెనీ నాసిరకం భద్రతా పద్ధతులను కలిగి ఉండటమే కాకుండా, సమస్యలను పరిష్కరించడంలో కూడా ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు. జాట్కో ఈ నివేదికలో పలు కీలక అంశాల్ని వెల్లడించారు. ఇవి భారత్ లో కచ్చితంగా సంచలనం రేపేలా ఉన్నాయి.

indian government agent in twitter accessing user data- says former security chief

ట్విట్టర్ అనుసరిస్తున్న యూజర్ల డేటా భద్రత, భద్రతా విధానాల్లో లోపాలున్నాయని పీటర్ జాట్కో తన నివేదికలో తెలిపారు. అలాగే భారత ప్రభుత్వంలోనూ కలకలం రేపేలా పలు అంశాల్ని ఆయన వెల్లడించారు. కొన్ని సంవత్సరాల క్రితం భారత ప్రభుత్వం ఒత్తిడితో ట్విట్టర్ తమ సంస్ధలో ప్రభుత్వ ఏజెంట్‌ను నియమించిందని, వినియోగదారుల డేటాకు పూర్తి యాక్సెస్ ను అతనికి ఇచ్చిందని జాట్కో సంచలన ఆరోపణలు చేశారు. జాట్కో ఆరోపణలను ది వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. ఇది విజిల్‌బ్లోయర్ FTCకి దాఖలు చేసిన ఫిర్యాదును కూడా ప్రస్తావించింది.

దేశంలో తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో వినియోగదారుల డేటాను యాక్సెస్ చేయడంతో భారత ప్రభుత్వం తన ఏజెంట్లలో ఒకరిని పేరోల్‌లో ఉంచమని ట్విట్టర్‌ని బలవంతం చేసిందని జాట్కో ఫిర్యాదు పేర్కొంది.
మరో ట్విటర్ ఉద్యోగి జాట్కోతో ఏకీభవించారని, "ఆ ఉద్యోగి బహుశా ఏజెంట్ అయి ఉండవచ్చు" అని అంగీకరించారని నివేదిక పేర్కొంది. గౌరవనీయమైన, ప్రసిద్ధ హ్యాకర్ అయిన జాట్కోను 2020లో మాజీ ట్విటర్ సీఈఓ జాక్ డోర్సే నియమించుకున్నారు. భద్రతాపరమైన సంఘటనల తర్వాత హై ప్రొఫైల్ ఉన్న ట్విట్టర్ వినియోగదారులు వారి ఖాతాలకు యాక్సెస్ కోల్పోతున్నారు. దీనిపై విమర్శలు వస్తున్న తరుణంలోనే తాజా ఆరోపణలు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+