ఉర్దూలో అసద్: సోనియాకి మోడీ నమస్కారం(పిక్చర్స్)
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ, కేంద్రమంత్రులు, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తదితరులు గురువారం ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారితో ప్రొటెం స్పీకర్ కమల్ నాథ్ ప్రమాణం చేయించారు. కాగా, పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు బుధవారం మోడీ పక్కన అద్వానీ కూర్చున్నారు. కానీ రెండో రోజు గురువారం మాత్రం ఆయన మోడీ పక్కన కూర్చోలేదు. అయితే తనను రెండో వరుసలో కూర్చోనివ్వాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యతో అద్వానీ చెప్పారట.
దానికి వెంకయ్య నిరాకరించారట. మొదటి వరుసలోనే కూర్చోవాలని కోరారట. అయితే మోడీ పక్కన మాత్రం కూర్చోలేదు. ఇక రాహుల్ గాంధీ రెండో రోజు కూడా వెనుకాలే కూర్చున్నారు. మరోవైపు లోకసభలో పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు తమ తమ మాతృభాషలో ప్రమాణం చేశారు. తెలుగు ఎంపీలు చాలామంది తెలుగులోనే ప్రమాణం చేశారు. కేంద్రమంత్రులు సదానంద గౌడ కన్నడలో, జ్యూయల్ ఓరమ్ ఒడిశాలో, హర్‌సిమ్రాత్ కౌర్ పంజాబీలో ప్రమాణం చేశారు.
కల్వకుంట్ల కవిత (నిజామాబాద్) ఇంగ్లీషులో, మల్లారెడ్డి (మల్కాజిగిరి) తెలుగులో, బండారు దత్తాత్రేయ (సికింద్రాబాద్) హిందీలో, అసదుద్దీన్ ఓవైసీ(హైదరాబాద్) ఉర్దూలో, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జితెందర్ రెడ్డిలు ఇంగ్లీషులో ప్రమాణం చేశారు. కాగా, లోకసభ స్పీకర్‌గా సుమిత్రా మహాజన్ పేరును బిజెపి సూచించింది. స్పీకర్ ఎన్నికలో సహకరించాలని వెంకయ్య నాయుడు తెరాసను కోరారు.

మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోకసభ సభ్యునిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ కమల్ నాథ్ ఆయనతో ప్రమాణం చేయించారు.

అద్వానీ
బిజెపి సీనియర్ నేత అద్వానీ లోకసభ సభ్యునిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ కమల్ నాథ్ ఆయనతో ప్రమాణం చేయించారు.

సోనియాకు మోడీ నమస్కారం
లోకసభలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నమస్కరిస్తున్న దృశ్యం. సోనియా ప్రతి నమస్కారం చేశారు.

పార్లమెంట్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ, కేంద్రమంత్రులు, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తదితరులు గురువారం ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారితో ప్రొటెం స్పీకర్ కమల్ నాథ్ ప్రమాణం చేయించారు.

సోనియా గాంధీ
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ లోకసభ సభ్యునిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ కమల్ నాథ్ ఆయనతో ప్రమాణం చేయించారు.












Click it and Unblock the Notifications