వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండోనేషియా మిస్సింగ్ జలాంతర్గామి కోసం రంగంలోకి దిగిన ఇండియన్ నేవీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/జకార్తా: బాలి సమీపంలో అదృశ్యమైన ఇండోనేషియా సబ్‌మెరైన్ (జలాంతర్గామి)ని వెదికేందుకు భారత నావికా దళానికి చెందిన డీప్ సబ్‌మెర్జెన్స్ రెస్క్యూ వెస్సెల్(డీఎస్ఆర్వీ) బయలుదేరింది. బుధవారం బాలీకి ఉత్తరాన ఇండోనేషియాకు చెందిన సబ్‌మెరైన్ కాంటాక్ట్ కోల్పోయిన విషయం తెలిసిందే.

బాలి సమీపంలో కాంటాక్ట్ కోల్పోయిన ఇండోనేషియా నేవీ సబ్‌మెరైన్, 53 మంది..బాలి సమీపంలో కాంటాక్ట్ కోల్పోయిన ఇండోనేషియా నేవీ సబ్‌మెరైన్, 53 మంది..

ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ సబ్ మెరైన్ ఎస్కేప్ అండ్ రెస్క్యూ లియజన్ ఆఫీస్(ఐఎస్ఎంఈఆర్‌ఎలోవో) నుంచి అప్రమత్త కోసం హెచ్చరికలు వచ్చాయి. కాగా, జలాంతర్గామి గురువారం జరగబోయే క్షిపణి కాల్పుల ఎక్సర్సైజ్ కోసం రిహార్సల్ చేస్తోంది.

 Indian Navy Dispatches its Deep Submergence Rescue Vessel to Support Search and Rescue of Missing Indonesian Submarine

కేఆర్ఐ నంఘాలా 402 శిక్షణా కార్యక్రమంలో పాల్గొంటోందని, అయితే, షెడ్యూల్ రిపోర్ట్ చేయాల్సి ఉండగా, అందుబాటులోకి రాలేదని ఇండోనేషియా మిలిటరీ చీఫ్ హడి తజ్జాంటో బుధవారం తెలిపారు. బాలీకి ఉత్తరాన 95 కిలోమీటర్ల దూరంలో ఆ జలాంతర్గామి అదృశ్యమైందని చెప్పారు.

 Indian Navy Dispatches its Deep Submergence Rescue Vessel to Support Search and Rescue of Missing Indonesian Submarine

జలాంతర్గామి తప్పిపోయినట్లు లేదా మునిగిపోయినట్లు నివేదించబడినప్పుడు జలాంతర్గామి రక్షణ అవసరం, సదరు జలాంతర్గామిని గుర్తించడానికి.. జలాంతర్గామి లోపల చిక్కుకున్న సిబ్బందిని రక్షించడానికి నీటి అడుగున శోధనకు ప్రత్యేక పరికరాలు అవసరమవుతాయి.

డీఎస్ఆర్వీ ద్వారా.. అదృశ్యమైన జలాంతర్గామి శోధన, రక్షణను చేపట్టగల ప్రపంచంలోని కొన్ని దేశాలలో భారతదేశం ఒకటి. ఇండియన్ నేవీ తన డీఎస్ఆర్వీ వ్యవస్థ ద్వారా 1000 మీటర్ల లోతు వరకు ఒక జలాంతర్గామిని.. సైడ్ స్కాన్ సోనార్ (ఎస్ఎస్ఎస్), రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్(ఆర్ఓవీ)లను ఉపయోగించుకుని గుర్తించే అవకాశం ఉంది.

 Indian Navy Dispatches its Deep Submergence Rescue Vessel to Support Search and Rescue of Missing Indonesian Submarine

జలాంతర్గామి విజయవంతంగా గుర్తించిన తరువాత, చిక్కుకున్న సిబ్బందిని రక్షించడానికి డీఎస్ఆర్వీ- జలాంతర్గామి రెస్క్యూ వెహికల్ (ఎస్ఆర్వీ) - జలాంతర్గామితో సహచరులు రంగంలోకి దిగుతాయి. జలాంతర్గామికి అత్యవసర సామాగ్రిని అందించడానికి కూడా ఎస్ఆర్వీ ఉపయోగపడుతుంది.

భారతదేశం, ఇండోనేషియా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది. భారత నావికాదళం, ఇండోనేషియా నావికాదళం కార్యాచరణ సహకారంలో బలమైన భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాయి. ఈ రెండు నావికాదళాలు గతంలో క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేసేవి. ప్రస్తుత మిషన్‌కు ముఖ్యమైనవిగా భావించే సినర్జీ, ఇంటర్‌పెరాబిలిటీని అభివృద్ధి చేశాయి.

English summary
Indian Navy dispatched its Deep Submergence Rescue Vessel (DSRV) on Thursday to assist TentaraNasional Indonesia-AngkatanLaut (TNI AL - Indonesian Navy) in search and rescue efforts for the Indonesian Submarine KRINanggala which was reported missing on Wednesday 21 Apr 21.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X