మద్యం సేవించి నౌకను నడిపినందుకు రూ. లక్షన్నర జరిమానా
మోతాదుకు మంచి మద్యాన్ని సేవించి నౌకను నడిపిన ఓ భారతీయ సంతతికి చెందిన నావికుడికి న్యూజిలాండ్ ప్రభుత్వం NZ$3,000 (సుమారు రూ. లక్షన్నర) జరిమానా విధించింది.
ప్రమోద్ కుమార్ (36) అనే నావికుడు ప్రభుత్వం అనుమతించేదానికన్నా ఐదు రెట్లు ఎక్కువగా ఆల్కాహాల్ తీసుకున్నాడని పోలీసులు తౌరంగా జిల్లా కోర్టుకు వెల్లడించారు. ప్రమోద్ కుమార్ నడుతున్న నౌకలో 37,000 టన్నుల ఫర్జిలైజర్స్ ఉన్నట్లు తెలిపారు.

మద్యం ఎక్కువగా సేవించి నౌకను అలా అజాగ్రత్తగా నడపడం వల్ల పెద్ద ప్రమాదం సంభవించే ఉండేదని పేర్కొన్నారు. న్యూజిలాండ్‌లోని తౌరంగా అనే జిల్లాలోని సముద్ర తీరంలో నౌకను నిలిపి ఉంచేందుకు గాను ప్రమోద్ కుమార్‌కి పరీక్షలు నిర్వహించారు.
మార్చి 22న నిర్వహించి ఈ పరీక్షల్లో ప్రమోద్ కుమార్ ఎక్కువ మద్యం సేవించి ఉండటంతోనే అతనికి జరిమానా విధించామన్నారు. సాధారణంగా న్యూజిలాండ్ ప్రభుత్వం ప్రకారం సముద్ర తీరంలోకి వచ్చిన నావికులు 250 మిల్లి గ్రాముల ఆల్కహాల్‌ను తీసుకునేందుకు అనుమతి ఉంది.












Click it and Unblock the Notifications