Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైల్వే కొత్త ఆపరేషన్- ట్రైన్లలో మఫ్టీలో సిబ్బంది..! ఏం చేస్తారో తెలుసా ?

వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యోగులు కలిగిన ప్రభుత్వ రంగ సంస్ధ భారతీయ రైల్వే ఈ మధ్య కాలంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా వందే భారత్ రైళ్లతో పాటు సరికొత్త సదుపాయాలు కలిగిన పర్యాటక రైళ్లు, అందులో సదుపాయాలు దర్శనమిస్తున్నాయి. అయితే ఇంకా ప్రయాణికుల్లో సంతృప్తి కనిపించడం లేదు. దీంతో ప్రయాణికుల అభిరుచుల్ని తెలుసుకునేందుకు మరో సరికొత్త ప్రయోగానికి రైల్వే సిద్దమైంది.

ఇందులో భాగంగా రైల్వే సిబ్బంది మఫ్టీలో రైళ్లలోనే ప్రయాణిస్తూ ప్రయాణికులతో కలిసి పోయి వారి నుంచి రైళ్లలో అందుతుున్న సదుపాయాలపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. ఈ సరికొత్త కార్యక్రమాన్ని రైల్వే ఇవాళ ప్రయాగ్ రాజ్ లో ప్రారంభించింది. ముందుగా వీరు ప్రతీ రైలులోనూ ప్రయాణికుల్లా ప్రయాణిస్తూ సదరు రైలులో ఉన్న లోటుపాట్ల గురించి తెలుసుకుని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తారు. అలాగే ప్రయాణికులతో మాట్లాడుతూ వారి ఫీడ్ బ్యాక్ ను తీసుకుంటారు.

Indian railway s new campaign undercover officials to take feedback from passengers on amenities

ఇలా రైల్వే సిబ్బంది ప్రయాణికుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునే అంశాల్లో టాయిలెట్లు, ఛార్జింగ్ పాయింట్లు, లైట్లు, ఫ్యాన్లు, నీటి లభ్యత, శుభ్రత వంటి సౌకర్యాలు ఉంటాయి. వీటిపై ప్రయాణికులు ఏమనుకుంటున్నారో ఆరా తీస్తారు. వీరి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకునేలా రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాణీకుల విశ్వాసాన్ని పెంపొందించడం, సున్నితమైన, సురక్షితమైన ప్రయాణాలు జరిగేలా చూడటమే లక్ష్యంగా దీన్ని రూపొందించారు. ప్రయాణీకుల సౌలభ్యం, నాణ్యమైన సేవకు ప్రాధాన్యత ఇవ్వాలనే భారతీయ రైల్వేల దార్శనికతలో భాగంగా దీన్ని చేపట్టారు.

తొలి రోజు ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో 25 మంది రైల్వే ఉద్యోగుల బృందం 50 రైళ్లను ఇలా తనిఖీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీరు గుర్తించిన సమస్యలపై వెంటనే చర్యలు కూడా తీసుకోవడం ప్రారంభించారు. దీన్ని క్రమంగా రైల్వేలోని ఇతర జోన్లకూ, డివిజన్లకూ త్వరలోనే వర్తింపచేయనున్నారు. వీటితో పాటు ప్రతీ స్టేషన్ లోనూ ఆకస్మిక టికెట్ తనిఖీలు, ఇతర సదుపాయాల తనిఖీలు కూడా చేపట్టనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+