చైనాకు ఇక చుక్కలే..! బోర్డర్ లో భారత్ బిగ్ స్కెచ్..! ఎల్లుండే ప్రారంభం..!

చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖకు సమీపంలో భారత్ అత్యవసరంగా యుద్దవిమానాలు దిగేందుకు వీలుగా ఓ హైవేను రన్ వేగా మార్చి ఎల్లుండి ప్రారంభిస్తోంది.

భారత్ (india)కు చైనా సరిహద్దుల్లో పొంచి ఉన్న శత్రువుల ముప్పు నేపథ్యంలో వాస్తవాధీన రేఖ వెంట ప్రతీ నిర్ణయమూ కీలకంగా మారుతోంది. ఇందులో భాగంగా అత్యవసర పరిస్ధితుల్లో చైనా నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనేందుకు వైమానిక దళం కీలక అడుగు వేస్తోంది. ఈశాన్య భారతం పరిధిలో ఇలాంటి ప్రయత్నం ఇదే తొలిసారి. దీన్ని ఎల్లుండి ప్రధాని మోడీ అధికారికంగా ప్రారంభించబోతున్నారు.

ఈశాన్య భారతదేశంలో తొలి రహదారి రన్‌వేను ప్రధాని మోడీ ఎల్లుండి ప్రారంభిస్తారు. అసోంలోని డిబ్రూగఢ్ జిల్లాలో నిర్మించిన అత్యవసర ల్యాండింగ్ సౌకర్యం (ELF)పై ప్రధాని ల్యాండ్ కానున్నారు. డిబ్రూగఢ్-మోరాన్ జాతీయ రహదారిలోని ఈ 4.2 కిలోమీటర్ల భాగం.. చైనాతో ఉన్న వాస్తవ నియంత్రణ రేఖ (LAC)కు సమీపంలో ఉండటం వలన వ్యూహాత్మకంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది.

India s Strategic Move Highway Near China Border Becomes Airstrip for Rafales and Globemasters

ఈ ప్రారంభోత్సవంలో రాఫెల్‌లు, సుఖోయ్‌లతో సహా సుమారు 16 భారత వైమానిక దళ విమానాలు భారీ వాయు విన్యాసాల్లో పాల్గొంటాయి. అనేక యుద్ధ విమానాలు ఈ రహదారి రన్‌వేపై దిగేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రారంభానికి కొద్ది రోజుల ముందు, రాఫెల్ యుద్ధ విమానాలు, సీ-17 గ్లోబ్‌మాస్టర్ రవాణా విమానాలు ఈ స్ట్రిప్‌పై విజయవంతంగా ల్యాండింగ్ పరీక్షలు నిర్వహించాయి. ఈ సౌకర్యం జాతీయ భద్రత, విపత్తు సన్నద్ధతను గణనీయంగా పెంచబోతోంది. వైమానిక స్థావరాలు నిరుపయోగంగా మారినప్పుడు ప్రత్యామ్నాయ రన్‌వేలుగా ఇవి కీలకం. తద్వారా కీలకమైన కార్యకలాపాలు కొనసాగుతాయి.

India s Strategic Move Highway Near China Border Becomes Airstrip for Rafales and Globemasters

భారత్ లో ఇప్పటికే నిర్మించిన ఇలాంటి ఎమర్జెన్సీ రన్ వేలు పశ్చిమ, ఉత్తర, మధ్య ప్రాంతాలలో ఉన్నాయి. అయితే ఈశాన్యంలోని అసోంలో దీన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఎయిర్ ఫోర్స్, రవాణాశాఖ దేశవ్యాప్తంగా ఇలాంటి 28-29 ఎమర్జెన్సీ రన్ వేలను నిర్మాణం కోసం గుర్తించగా, ఇందులో 15 సౌకర్యాలు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నాయి. తాజ్ ఎక్స్‌ప్రెస్‌వే, గంగా ఎక్స్‌ప్రెస్‌వే, రాజస్థాన్‌లోని NH-925A వంటి కొన్ని హైవే రన్ వేలు ఇప్పటికే కార్యాచరణలో ఉన్నాయి. తూర్పు లడఖ్‌లో ఉద్రిక్తతల తర్వాత భారత్ కొన్నేళ్లుగా ఈశాన్యంలో సరిహద్దు మౌలిక సదుపాయాలను విస్తరిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+