Video viral: విమానం పైలట్ పై ప్యాసింజర్ పిడిగుద్దులు..!
Punches on Pilot:బస్సులోనో, రైళ్లోనో, లేదా ఇతర వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు గమ్యస్థానం ఎంత త్వరగా చేరుకుంటే అంత బాగుంటుందనిపిస్తుంది. రావాల్సిన బస్సు లేదా రైలు లేదా విమానం సరైన సమయానికి రాకపోతే ఓపిక నశిస్తుంది. వాటి కోసం ఎదురు చూసి చూసి సహనం నశిస్తుంది. కొన్ని సార్లయితే వాహనాల్లో కూర్చుని ఉన్న ప్రయాణికులకు సహనం నశించి డ్రైవర్లపై దాడులకు దిగిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
A passenger punched an Indigo capt in the aircraft as he was making delay announcement. The guy ran up from the last row and punched the new Capt who replaced the previous crew who crossed FDTL. Unbelievable ! @DGCAIndia @MoCA_GoI pic.twitter.com/SkdlpWbaDd
— Capt_Ck (@Capt_Ck) January 14, 2024
అది ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఢిల్లీ నుంచి గోవాకు వెళ్లాల్సిన ఇండిగో విమానం (6E-2175) బయలు దేరేందుకు సిద్ధంగా ఉంది. అంతలోనే విమానం టేకాఫ్ తీసుకునేందుకు కొంత సమయం పడుతుందంటూ ప్రకటన వచ్చేసింది. దీంతో ప్రయాణికులంతా ఓపికతో వేచి చూశారు. విమానాశ్రయంలో మంచు ఎక్కువగా ఉండటంతో అధికారులు విమానం టేకాఫ్ అయ్యేందుకు అనుమతి ఇవ్వలేదు. ఇలా కొన్ని గంటలు గడిచాయి. ఇక ఫ్లయిట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ ప్రకారం అప్పటి వరకున్న పైలట్ సమయం పూర్తికావడంతో అతను వెళ్లిపోయి... మరో కొత్త పైలట్ బాధ్యతలు తీసుకున్నాడు.

ఇక కొత్త పైలట్ మరోసారి ఓ ప్రకటన చేశాడు. విమానం టేకాఫ్‌కు ఇంకాస్త సమయం తీసుకుంటుందని. దీంతో విమానంలో అప్పటి వరకు కూర్చున్న ప్రయాణికుల్లో సహనం చచ్చిపోయింది. పైలట్ ఇలా ప్రకటన చేశాడో లేదో వెంటనే వెనుక సీటులో పసుపు పచ్చ రంగు హుడీ ధరించిన ఓ ప్రయాణికుడు పైలట్ పైకి దూసుకొచ్చి పిడిగుద్దులు గుద్దాడు. ఇంకా ఎన్ని గంటలు ఇలా విమానంలోనే కూర్చోబెడతారు అంటూ దాడి చేశాడు. ఒక్కసారిగా విమానంలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఓ వైపు విమానం ఎయిర్ హోస్టెస్ ఇది పద్దతి కాదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అయినా సరే ఈ ప్యాసింజర్ వినకుండా దాడి చేసే ప్రయత్నం చేశాడు. దాడి చేసిన ప్రయాణికుడిని సాహిల్ కటారియాగా గుర్తించారు. అతన్ని విమానం దించి అధికారులకు అప్పజెప్పారు. ఇదంతా మరో ప్రయాణికుడు తన మొబైల్‌లో రికార్డు చేశాడు. వెంటనే సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వీడియో వైరల్ అవుతోంది.
"విమానం టేకాఫ్ అవడంలో జాప్యమైతే పైలెట్‌కు సంబంధం ఏంటి,వారు వారి డ్యూటీని చేస్తున్నారంతే. దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అతన్ని నో ఫ్లై లిస్టులో చేర్చి అతని ఫోటోను ప్రచురణ చేయాలి. ప్రజలు ఇలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉంటారు " అంటూ నెటిజెన్లు కామెంట్ రూపంలో తెలుపుతూ పైలట్‌కు మద్దతుగా నిలిచారు. దాడి చేసిన వ్యక్తిని నో ఫ్లై లిస్టులో చేరుస్తూ అతనిపై కేసు నమోదు చేయాలంటూ మరో నెటిజెన్ పేర్కొన్నాడు. ఈ మధ్యకాలంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ వార్తల్లో ఎక్కువగా ఉంటోందని అందులో ఎక్కువగా నెగిటివ్ న్యూస్ ఉంటున్నాయంటూ మరో నెటిజెన్ తెలిపారు.
ఇదిలా ఉంటే ఢిల్లీలో పొగమంచు కారణంగా సోమవారం రోజున 110 విమానాలు డిలే అవ్వగా 79 విమానాలు రద్దయ్యాయి. డిలే సగటున 50 నిమిషాలుగా ఉన్నట్లు సమాచారం. ఆదివారం రోజున చాలా విమానాలు ల్యాండ్ అవడంలో కానీ టేకాఫ్ అవడంలో కానీ జాప్యమయ్యాయి. దాదాపుగా 7 గంటల నుంచి 8 గంటల ఆలస్యంగా బయలుదేరాయి. ఢిల్లీ కోల్‌కతా విమానాశ్రయాల నుంచి బయలుదేరే తమ విమానాలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నట్లు ముందుగానే ఆయా విమానాయాన సంస్థలైన ఇండిగో, స్పెస్ జెట్, విస్తారాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications