వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్పోసిస్‌లో చేరాలని ఎస్‌బిఐ ఛైర్మెన్ అరుంధతికి బంపర్ ఆఫర్

ఎస్‌బిఐ ఛైర్మెన్ అరుంధతికి ఇన్పోసిస్ నుండి బంపర్ ఆఫర్ వచ్చింది.ఇన్పోసిస్‌లో చేరాలని అరుంధతిని కోరినట్టు జాతీయ మీడియా కథనం .ఉద్యోగ విరమణ చేసిన కొంత కాలానికి ఆమె ఈ విషయమై నిర్ణయం తీసుకోనే అవకాశం.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: సంక్షోభంలో ఉన్న సంస్థను గాడిలో పెట్టేందుకు ఎస్‌బిఐ ఛైర్మెన్ అరుంధతీ భట్టాచార్యకు ఇన్పోసిస్ నుండి ఆహ్వనం అందింది. ఈ మేరకు జాతీయ పత్రిక కథనాన్ని ప్రచురించింది.

ఈ ఏడాది అక్టోబ‌ర్ 6న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న ఎస్‌బీఐ చైర్మ‌న్ అరుంధ‌తీ భ‌ట్టాచార్య ఉద్యోగ విరమణ చేయనున్నారు. దీంతో ఇన్ఫోసిస్ నుంచి త‌మ బోర్డులో చేరాల‌ని అరుంధతికి ఆహ్వానం వెళ్లిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. మాజీ సీఈఓ విశాల్ సిక్కా రాజీనామా చేయ‌డానికి ప‌ది రోజుల ముందే ఆమెకు ఈ మేర‌కు ఈ-మెయిల్ వెళ్లిన‌ట్లు తెలుస్తోంది.

Infosys invites Arundhati Bhattacharya to join its board: Report

అయితే దీనిపై అరుంధ‌తీ నుంచి ఎలాంటి స్పంద‌న రాలేద‌ని స‌మాచారం. అలాగే మ‌రో ఐటీ కంపెనీ నుంచి ఆమెకు ఆఫ‌ర్ అందిన‌ట్లు తెలుస్తోంది.

తాను ఉద్యోగ విర‌మ‌ణ చేసిన కొన్ని నెల‌ల‌కు ఇన్ఫోసిస్‌లో చేరేందుకే అరుంధ‌తీ మొగ్గు చూపుతార‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ప్ర‌భుత్వోద్యోగులు ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన త‌ర్వాత కొంత విరామం తీసుకున్నాకే వేరే ప్రైవేటు ఉద్యోగంలో చేరాలి. దీంతో కొన్నినెల‌లు ఆమె విరామం తీసుకోవ‌చ్చ‌ని వారు చెబుతున్నారు.

ఒక‌వేళ ఆమె ఇన్ఫోసిస్ బోర్డులో చేరితే ఇప్ప‌టికే ఉన్న కిర‌ణ్ మ‌జుందార్ షా, పుణీతా కుమార్ సిన్హా, రూపా కుద్వాల స‌ర‌స‌న కంపెనీ బోర్డులో ప‌నిచేసే నాలుగో మ‌హిళ అవుతారు.

English summary
India's second largest information technology company, Infosys has invited State Bank of India Chairman Arundhati Bhattacharya to join its board, Bhattacharya
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X