Infosys: ఇన్ఫోసిస్ ఉద్యోగుల జీతాల పెంపు- రెండు విడతల్లో- 20 వేల ఫ్రెషర్లకు చోటు..!

దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) ఇవాళ తమ ఉద్యోగులకు జీతాల పెంపుపై శుభవార్త చెప్పింది. అలాగే కొత్తగా నియామకాలపైనా కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీలో నిపుణుల డిమాండ్ కొనసాగుతున్న నేపథ్యంలో జీతాల పెంపును ప్రకటించింది. ఏడాదిలో రెండుసార్లు ఈ జీతాల పెంపు ఉండేలా కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు 20 వేల మంది కొత్త ఉద్యోగులను తీసుకోబోతున్నట్లు కూడా వెల్లడించింది.

అక్టోబర్ నుంచి తమ ఉద్యోగుల వేతన పెంపు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ ఇవాళ వెల్లడించారు. అలాగే మిగిలిన పెంపులను జనవరిలో అమలు చేయనున్నట్లు తెలిపారు. చాలా మంది ఉద్యోగులకు అక్టోబర్‌లోనూ, సీనియర్ ఉద్యోగులకు జనవరిలోనూ వేతన పెంపు లభిస్తుందని ఆయన తెలిపారు. కంపెనీ ఆర్థిక ఫలితాలను వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పరేఖ్ ఈ ప్రకటనలు చేశారు.

Infosys Unveils Two-Stage Salary Hike Plan Eyes 20 000 Fresher Hires This Year

జూన్ తో ముగిసిన మొదటి త్రైమాసిక నికర లాభంలో 12.2 శాతం వృద్ధిని నమోదు చేసిన ఇన్ఫోసిస్.. రూ.7,769 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్-జూన్ 2026 కాలంలో కంపెనీ ఆదాయం 14 శాతం పెరిగి రూ.48,211 కోట్లకు చేరింది. అలాగే 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వృద్ధి అంచనాలను కూడా కంపెనీ సవరించింది. ప్రస్తుతం ఈ వృద్ధి రేటును 1.5 నుండి 3 శాతంగా అంచనా వేస్తోంది. దీంతో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇప్పటికే 4వేల మందికి పైగా ఫ్రెషర్లను విధుల్లోకి తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+