ఓ టీవీ యాంకర్ ప్రశ్న... సర్జికల్ దాడులకు కారణమైంది: పారికర్

ఓ టీవీ యాంకర్‌ అడిగిన అవమానకర ప్రశ్నే.. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ సర్జికల్‌ దాడులు చేసేందుకు కారణమైందట. ఈ విషయాన్ని మాజీ రక్షణ మంత్రి, గోవా ప్రస్తుత ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్

పనాజీ: ఓ టీవీ యాంకర్‌ అడిగిన అవమానకర ప్రశ్నే.. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ సర్జికల్‌ దాడులు చేసేందుకు నాంది పలికిందని మాజీ రక్షణ మంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ అన్నారు.

గోవాలో జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొన్న ఆయన.. గతేడాది భారత్‌ చేపట్టిన సర్జికల్‌ దాడుల గురించి ప్రస్తావించారు. ఆ దాడులపై 15 నెలల ముందు నుంచే ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.

Insulting question by TV anchor led to planning of PoK surgical strikes, says Manohar Parrikar

2015 జూన్‌ 4న మణిపూర్‌లోని చందెల్‌ జిల్లాలో భారత జవాన్ల కాన్వాయ్‌పై మిలిటెంట్లు దాడి చేశారు. ఆ ఘటనలో 18 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలిసి తాను చాలా బాధపడినట్లు పారికర్ వెల్లడించారు.

కనీసం 200 మంది కూడా లేని ఓ చిన్న ఉగ్రవాద సంస్థ 18 మంది భారత జవాన్ల ప్రాణం తీసిందని తెలిసి తనకు అవమానంగా అనిపించిందని, దీంతో ఉగ్రవాదులకు దీటుగా బదులివ్వాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.

సైన్యంతో సమావేశమై.. అదే ఏడాది జూన్‌ 8న భారత్‌-మయన్మార్‌ సరిహద్దుల్లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసి.. 70 నుంచి 80 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు పారికర్‌ తెలిపారు.

ఆ దాడులు విజయవంతమైన తర్వాత కేంద్రమంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ను ఓ విలేకరి ప్రశ్నించారని, 'ఇలాంటి దాడులనే పశ్చిమ సరిహద్దుల్లోనూ చేసే ధైర్యం, సామర్థ్యం మీకున్నాయా? అని ఆ విలేకరి అడిగారని చెప్పారు.

పశ్చిమ సరిహద్దులంటే పాకిస్తాన్‌తోనేనని, ఆ ప్రశ్న వినగానే తనకు చాలా అవమానకరంగా అన్పించిందని. ఆ మరుసటి రోజు నుంచే సర్జికల్‌ దాడులకు ప్రణాళిక రూపొందించామని, అలా 2016 సెప్టెంబర్‌ 29న పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో సర్జికల్‌ దాడులు చేపట్టామని పారికర్‌ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+