చిక్కుల్లో చిదంబరం ఫ్యామిలీ.. ఇంద్రాణితోనే అసలు తంటా.. చిద్దూకూ విచారణ తప్పదా?
న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ) సూచనలకు భిన్నంగా ఐఎన్‌ఎక్స్ మీడియా సంస్థలోకి భారీగా విదేశీ పెట్టుబడుల స్వీకరణ, ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులతో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీ చిదంబరం కుటుంబం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పటికే ఐఎన్‌ఎక్స్ మీడియా విషయమై సీబీఐ అరెస్ట్ చేసిన కార్తి చిదంబరానికి ఇప్పటికే ఢిల్లీలోని పాటియాల ప్రత్యేక న్యాయస్థానం ఐదు రోజుల సీబీఐ కస్టడీ విధించింది. కాగా, ఈ కేసులో చిదంబరాన్ని కూడా విచారిస్తామని సీబీఐ తెలిపింది.
ఇందుకు కార్తి చిదంబరానికి ఆయన విదేశీ సంస్థల ద్వారా 10 లక్షల అమెరికన్ డాలర్లు ముడుపులుగా అందాయని సీబీఐ ఆరోపణ.
ఈ కేసుపై కార్తి చిదంబరం దిగువ న్యాయస్థానాలు, మద్రాస్ హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించారు. తన కుటుంబ సభ్యులను దర్యాప్తు సంస్థలు వేధిస్తున్నాయని ఆయన తండ్రి పీ చిదంబరం కూడా సుప్రీంకోర్టు తలుపు తట్టారు.
Recommended Video


చిదంబరం పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు సీబీఐ నివేదన
ఎయిర్‌సెల్ - మ్యాక్సిస్ కేసులో కేంద్ర టెలికాంశాఖ మాజీ మంత్రి దయానిధి మారన్ తదితరులకు విముక్తి లభించినా అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం పాత్రపై దర్యాప్తు జరుగుతూనే ఉంది. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ ఒప్పందానికి అనుమతించే అధికారం కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) మాత్రమే ఉండగా ఎఫ్‌ఐపీబీ అనుమతిని చిదంబరం ఎలా ఇప్పించారని దర్యాప్తు సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. ఈ వ్యవహారంలో చిదంబరం పాత్రపై దర్యాప్తు జరుపుతున్నామని గత ఏడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టుకి సీబీఐ తెలిపింది. ఇదే కేసులో స్థాయి నివేదికను సమర్పించాలని సీబీఐని ఈ ఏడాది జనవరి 4న సుప్రీంకోర్టు ఆదేశించింది.

కార్తికి సాయం చేయాలని చిదంబరం కోరారని ఇంద్రాణి వాంగ్మూలం
మలేషియా వ్యాపార దిగ్గజం టీ ఆనంద క్రిష్ణన్ ఆధ్వర్యంలో మ్యాక్సిస్ అనుబంధ సంస్థ గ్లోబల్ కమ్యూనికేషన్ సర్వీసెస్ హోల్డింగ్స్ లిమిటెడ్‌కు 2006 మార్చిలో అప్పటి ఆర్థిక మంత్రి పీ చిదంబరం ఎఫ్‌ఐపీబీ అనుమతి ఇప్పించారని సీబీఐ తన అభియోగ పత్రంలో పేర్కొంది. ఈ ఒప్పంద వివాదంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా విడిగా దర్యాప్తు కొనసాగిస్తోంది. తాజాగా ఇంద్రాణి ముఖర్జీ ప్రకటన చర్చనీయాంశమైంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం తన కుమారుడు కార్తీకి సహాయం చేయాలని కోరారని ఇంద్రాణి ముఖర్జీ దర్యాప్తు సంస్థ విచారణలో పేర్కొన్నట్లు వివిధ మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది.

కార్తి చిదంబరానికి రూ.4.5 కోట్ల ముడుపులు చెల్లింపులు
అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరంతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఢిల్లీలోని హోటల్ హయత్‌లో కార్తీని కలుసుకున్నట్లు చెప్పారు. కార్తీ చిదంబరానికి చెందిన విదేశీ, స్వదేశీ సంస్థలకు చెల్లించిన ముడుపులకు (రూ.4.5 కోట్లు) సంబంధించి ఐఎన్‌ఎక్స్ న్యూస్ మాజీ డైరెక్టర్ పీటర్ ముఖర్జీ సంతకం చేసిన నాలుగు ఇన్‌వాయిస్‌లను ఐఎన్‌ఎక్స్ మీడియా సీబీఐకి అందించింది. వీటిని సీబీఐ, ఈడీ పరిశీలిస్తున్నాయి.

త్వరలో చిదంబరాన్ని దర్యాప్తు సంస్థలు ప్రశ్నించే అవకాశం
మిలియన్ డాలర్ల (సుమారు రూ. 6.5 కోట్లు) ముడుపుల కేసు విచారణ సందర్భంగా ఐఎన్‌ఎక్స్ న్యూస్ మాజీ డైరెక్టర్, కుమార్తె షీనా బోరా హత్యకేసులో ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్న ఇంద్రాణి ముఖర్జీని సీబీఐ, ఈడీ తాజాగా ప్రశ్నించాయి. 2007లో ఐఎన్‌ఎక్స్ మీడియాకు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం పొందే క్రమంలో తన కుమారుడి వ్యాపారానికి సహకరించాలని చిదంబరమే తనను స్వయంగా కోరినట్టు ఇంద్రాణి తెలిపినట్టు సమాచారం. ఆయన కోరిక మేరకే తాను కొంత సహకరించానని కూడా ఇంద్రాణి వాగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో అతి త్వరలో చిదంబరాన్ని కూడా ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.

80:20 బంగారం పథకం దుర్వినియోగం ఇలా
యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం ప్రకటించిన 80:20 బంగారు పథకంపై ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ)లోని బీజేపీ సభ్యులు ధ్వజమెత్తారు. పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీతోపాటు పలువురు ఆభరణాల వ్యాపారుల చేతిలో ఈ పథకం దుర్వినియోగమైందని విమర్శించారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే అధ్యక్షతన పీఏసీ ఉప కమిటీ గురువారం సమావేశమయ్యింది. ఈ పథకం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.లక్ష కోట్ల నష్టం వచ్చిందని సభ్యులు ఆరోపించినట్లు తెలిసింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications