లక్కీచాన్స్, రూ 12 కోట్ల ఐఫోన్లు మాయం. హైవేలో దొంగల స్కెచ్ వర్కౌట్ అయ్యింది
భారత్‌లో ఐఫోన్‌కు విపరీతమై డిమాండ్ ఉంది. ఇప్పుడు దేశం మొత్తం ఐఫోన్ 16 విడుదల కోసం ఎదురుచూస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఐఫోన్ స్టోర్లలో ఐఫోన్ లు విక్రయాలు జరుగుతున్నాయి. ఐఫోన్లు భారతదేశంలోని ప్రముఖ స్టోర్లకు ఆ కంపెనీ ప్రతినిధులు ఫోన్లు సరఫరా చేస్తున్నారు. హరియాణలోని ఐఫోన్ ఫ్యాక్టరీ నుంచి చెన్నైకి ఫోన్లతో వెళ్తున్న ట్రక్కుపై దొంగలు దాడి చేసి 1,600 ఐఫోన్లు ఎత్తుకెళ్లారు.
చోరీ అయిన ఐఫోన్ల మొత్తం విలువ 12 కోట్ల రూపాయలు అని అధికారులు అంటున్నారు. అయితే ఈ ఘటన జరిగిన 15 రోజులైనా కేసు నమోదు కాకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తోందని ఓ పోలీసు అధికారి అంటున్నారు, ఈ ఘటనకు ముందు బందోబస్తు ఏర్పాటు చేసిన భద్రతా సిబ్బంది కూడా ఈ దోపిడీలో భాగం అయినట్లు తెలుస్తోంది. హరియాణలోని గురుగ్రామ్ నుంచి చెన్నైకి ఐఫోన్లను తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో భద్రతా సిబ్బంది వేరే వ్యక్తికి ఫోన్ చేసి మరికొందరికి అక్కడికి రావాలని చెప్పారని తెలిసింది. ఆ తర్వాత ట్రక్కు డ్రైవర్ ను బెదిరించి ఐఫోన్లు దొంగిలించారు. ఐఫోన్ల రవాణా సమయంలో పోలీసులతో పాటు కంపెనీ సెక్యూరిటీ గార్డులకు భద్రత బాధ్యతలు అప్పగించారు. అయితే ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని పోలీసు ఉన్నతాధికారుల విచారణలో వెలగు చూసింది.
ఇలా కొందరు పోలీసులు కేసు నమోదు చేయకుండా ఇన్ని రోజులు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ ఘటన ఆగస్టు 15వ తేదీ మధ్యప్రదేశ్ లో జరిగినా సెప్టెంబర్ ఒకటవ తేదీ వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఉన్నతాధికారుల జోక్యంతో మంగళవారం కేసు నమోదు చేశారు. ఐఫోన్లను రవాణా చేసే బాధ్యత కలిగిన గార్డులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. కేసు విచారణలో ఉందని, ఐఫోన్లు తీసుకు వెలుతున్న ట్రక్కుకు భధ్రత కల్పించడానికి వెళ్లిన పోలీసులు, సెక్యూరిటీ గార్డులను విచారణ చేస్తున్నామని ఓ పోలీసు అధికారి అంటున్నారు.












Click it and Unblock the Notifications