భటిండా ఢిల్లీ రైల్వే ట్రాక్‌పై ఇనుప రాడ్‌లు.. త‌ప్పిన ప్ర‌మాదం..

పంజాబ్‌లో రైలు ప్ర‌మాదం త‌ప్పింది. సోమవారం భటిండా- ఢిల్లీ రైల్వే ట్రాక్‌పై కొంద‌రు గుర్తుతెలియ‌ని దుండ‌గులు ఇనుప రాడ్‌లు పెట్టారు. ఈ ఇనుప రాడ్‌ల‌ను గ‌మ‌నించిన గూడ్స్ రైలు లోకో పైలట్ సకాలంలో బ్రేకులు వేయడంతో తృటిలో ప్రమాదం తప్పిన‌ట్లు అధికారులు చెబుతున్నారు.. వెంట‌నే సమాచారం అందుకున్న రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్ర‌క్రియ చేప‌ట్టారు.

పోలీసులు ఇచ్చిన పూర్తి స‌మాచారం మేర‌కు... నేటి తెల్లవారుజామున మూడు గంటల సమయంలో భటిండా- ఢిల్లీ రైల్వే ట్రాక్ గుండా ఒక గూడ్స్ రైలు ప్ర‌యాణిస్తోంది. అయితే ఎవ‌రో కొంద‌రు గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్ పై ఇనుప రాడ్లను పెట్టారు. ఆ ఇనుప రాడ్ల‌ను ముందుగా గుర్తించిన లోకో పైల‌ట్‌లు వెంటనే అప్ర‌మ‌త్త‌మ‌యి ట్రైన్‌ను అక్క‌డిక్క‌డే ఆపివేశారు. ఈ సంఘ‌ట‌న‌పై పూర్తి స్థాయిలో ప‌రిశీల‌న జ‌రుగుతున్న‌ట్లు భ‌టిండాలోని ప్రభుత్వ రైల్వే పోలీసు ఇన్వెస్టిగేటింగ్ అధికారి వివ‌రించారు. ఆ ఘ‌ట‌న స్థ‌లం నుంచి ఇప్పటి వరకు 9 ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్న‌ట్లు అధికారులు తెలిపారు.

Iron rods on Bathinda-Delhi railway track

ఇది ఐదో ఘ‌ట‌న‌..

ఇలాంటి ఘ‌ట‌న‌లు ఇటీవ‌లే చాలా ఎక్కువ‌యిపోయాయి. ఈ నెల‌లో ఇలాంటి సంఘ‌ట‌న చోటుచేసుకోవ‌డం ఇది ఐదోసారని అధికారులు చెబుతున్నారు. ఇటీవ‌లే (సెప్టెంబరు 22న)యూపీలోని కాన్పూర్ లో కూడా ఇలాంటి సంఘ‌ట‌నే జ‌రిగింది. పెరంబూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్‌లపై కొంద‌రు గుర్తుతెలియ‌ని దుండ‌గులు ఎల్‌పీజీ సిలిండర్ ఉంచిన‌ట్లు లోకోపైల‌ట్‌లు గుర్తించి స‌కాలంలో బ్రేకుల వేసి ట్రైన్ ను ఆపేశారు. దీంతో పెనుప్ర‌మాదం త‌ప్పింద‌ని అధికారులు అంటున్నారు. ఈ ఘ‌ట‌న‌ల‌తో పాటు ఆగస్టు నెల‌లో కూడా దేశవ్యాప్తంగా మొత్తం 18 సార్లు కొంద‌రు దుండ‌గులు రైళ్ల ప‌ట్టాలు తప్పించేందుకు ప్రయత్నించినట్లు రైల్వేశాఖ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+