Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సినిమాల్లోకి ఎంఎస్ ధోనీ: తన మూవీతోనే ఎంట్రీ!

హైదరాబాద్: క్రికెట్ ప్రపంచంలో తన ప్రత్యేకతను చాటుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) ఇప్పుడు పలు రంగాల్లో పెట్టుబడులు పెడుతూ రాణిస్తున్నారు. ఇప్పటికే సినిమా నిర్మాణ సంస్థను కూడా ఆయన ప్రకటించారు. ఈ సంస్థలో రూపొందిన తొలి చిత్రం 'లెట్స్ గెట్ మ్యారీడ్(LGM)' విడుదలకు కూడా సిద్ధమైంది.

జులై 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర బృందం ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అయితే, చిత్రంలో ఎంఎస్ ధోనీ కూడా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండటం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. కోలీవుడ్‌లో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఈ సినిమాలో ధోనీ అతిథి పాత్రలో కనిపించనున్నారు.

Is MS Dhoni making silver screen debut in his production movie

నిర్మాతగా వ్యవహరించిన తొలి సినిమా కాబట్టి.. ఈ చిత్రంతోనే ధోనీ వెండి తెరపైకి వస్తున్నారంటూ ప్రచారం జోరందుకుంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటనేది వెలువడలేదు. ఏదేమైనా ఈ చిత్రంలో ధోనీ నటిస్తున్నారా? లేదా? అనేది మాత్రం సినిమా విడుదలయ్యే వరకు సస్పెన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో సినిమాకు హైప్ కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉంది.

కాగా, ఎల్జీఎం సినిమాలో హరీశ్ కళ్యాణ్ హీరోగా, లవ్‌టుడే ఫేం హీరోయిన్‌గా నటిస్తున్నారు. రమేశ్ తమిళమణి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నదియా, యోగిబాబు, ఆర్జే విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అత్తాకోడళ్ల మధ్య జరిగే కథాంశంతో ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది.

రమేశ్ తమిళమణి గత సంవత్సరం ధోనీ ప్రధాన పాత్రలో.. 'అథర్వ ది ఆరిజన్' అనే వెబ్ సిరీస్ కూడా ప్రకటించారు. సైంటిఫిక్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే నవల 'అథర్వ ది ఆరిజన్' ఆధారంగా దాన్ని గ్రాఫిక్స్ రూపంలో తెరకెక్కిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2016లో ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'ఎంఎస్ ధోనీ' చిత్రం భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ధోనీ పాత్రలో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆకట్టుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+