ఐసిస్ షాకింగ్: 200 మందిని దారుణంగా రేప్ చేశాడు, పశ్చాత్తాపం లేదు
ఇస్లామిక్ మిలిటెంట్ అమర్ హుస్సేయిన్.. 200 మంది మహిళలను రేప్ చేశాడు. అంతేకాదు, 500 మందిని హత్య చేశాడు. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల ఆగడాలు ఎంతలా ఉంటాయో అందరికీ తెలిసిందే.
బాగ్దాద్: ఇస్లామిక్ మిలిటెంట్ అమర్ హుస్సేయిన్.. 200 మంది మహిళలను రేప్ చేశాడు. అంతేకాదు, 500 మందిని హత్య చేశాడు. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల ఆగడాలు ఎంతలా ఉంటాయో అందరికీ తెలిసిందే.
అమర్ హుస్సేయిన్ చాలా అమాయకంగా కనిపిస్తాడు. కానీ మానవ మృగం. ఐసిస్ ఉగ్రవాదిగా ఉన్న ఇతను వందల మంది అమాయక మహిళలపై అత్యాచారాలు చేయడం గమనార్హం. ఇన్ని దురాగాతాలు చేసిన అతను కుర్దు దళాలకు చిక్కడంతో అతడి దారుణాలు వెలుగు చూశాయి.

ఐసిస్ దమనకాండ
ఇరాక్‌లోని సింజార్ ప్రాంతంలోని మైనార్టీ తెగకు చెందిన యాజ్దీల పైన ఐసిస్ టెర్రరిస్టులు సాగించే దమనకాండ అందరికీ తెలిసిందే. 2014లో సింజార్‌ను ఉగ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. మగవాళ్లను దారుణంగా చంపేశారు.

యాజ్దీలపై దౌర్జన్యాలు
మహిళలను, యువతలను, చిన్న పిల్లలను సంతలో వస్తువులను అమ్మినట్టు విక్రయించి సెక్స్ బానిసలుగా మార్చారు. యాజ్దీలతో పాటు ఇతర మైనార్టీ తెగలపై వీరి దౌర్జన్యాలు సాగాయి. గాలింపుల పేరుతో ఇంటిలోకి చొరబడి మహిళలపై అత్యాచారాలకు పాల్పడినట్టు విచారణలో హుస్సేన్ వెల్లడించాడు.

200 మందిపై అత్యాచారం
దాదాపు 200 మందిపై అత్యాచారాలు జరిపినట్టు ఒప్పుకున్నాడు. అంతేకాకుండా తమ నేతల ఆదేశాలతో దాదాపు 500 మందికి మరణశిక్షను అమలు చేసినట్టు వెల్లడించాడు. తమ ఆధీనంలో ఉన్నవారి తల నరికివేయడం, పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చివేయడం ద్వారా చంపివేసినట్టు తెలిపాడు.

పశ్చాత్తాపం లేదు
అయితే తాను చేసిన దారుణాలకు అతను ఎటువంటి పశ్చాత్తాపం ప్రకటించలేదు. తమ వద్ద బందీలుగా ఉన్నవారి కళ్లకు గంతలు కట్టి ఎడారిలో తీసుకువెళ్లి కాల్చి వేయడాన్ని గురించి వివరించాడు. ఒకసారి దాదాపు నలభై మందిని చంపివేసిన ఘటనను తెలిపాడు. ఇన్ని దారుణాలు చేసిన హుస్సేన్ వయస్సు కేవలం 21.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications