సోనూసూద్‌పై ఐటీ దాడులు: ‘ఆయన వద్ద లెక్కల్లో చూపని ఆదాయం.. రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగ్గొట్టారు’ - సీబీడీటీ - BBC Newsreel

నటుడు సోనూసూద్ నివాసం, కార్యాలయాల్లో గత కొద్ది రోజులుగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
అయితే, ఈ ప్రకటనలో సోనూసూద్ పేరును ప్రస్తావించకుండా.. ఒక నటుడు అని మాత్రమే పేర్కొంది.
ఏఎన్ఐ వార్తా సంస్థ అందించిన వివరాల ప్రకారం.. ముంబైలోని నటుడి నివాసం, లక్నో కేంద్రంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగంలో పనిచేసే ఒక పారిశ్రామిక సంస్థ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరిపింది.
ముంబై, లక్నోలతో పాటు కాన్పూర్, జైపూర్, దిల్లీ, గురుగ్రామ్‌ల్లో కూడా ఈ సోదాలు నిర్వహించినట్లు సీబీడీటీ తెలిపింది.
https://twitter.com/ANI/status/1439111634841063424
నటుడు, అతని సిబ్బంది ఆదాయపు పన్ను ఎగవేసినట్లు నేరాన్ని నిరూపించగల సాక్ష్యాలు ఈ దాడుల సందర్భంగా లభించాయని వెల్లడించింది.
లెక్కల్లో చూపని తన ఆదాయాన్ని పలు బోగస్ కంపెనీల నుంచి అసురక్షిత మార్గాల్లో అప్పుల రూపంలో తీసుకున్నట్లుగా చిత్రీకరించడమే నటుడి ప్రణాళిక అని పేర్కొంది.
ఇప్పటి వరకూ తమకు అందిన ఆధారాల ప్రకారం రూ.20 కోట్లకు పైగా ఆదాయపు పన్నును ఎగవేసినట్లు తేలిందని సీబీడీటీ వివరించింది.
ఇవి కూడా చదవండి:
- ఉప్పాడ: ఈ ఊరిని సముద్రం మింగేస్తోందా?
- 'ఆస్ట్రేలియా, అమెరికా కలసి వెన్నుపోటు పొడిచాయి’ - ఫ్రాన్స్ ఆరోపణ.. రాయబారులను వెనక్కు పిలిపించిన మేక్రాన్
- తప్పు ఒప్పుకున్న అమెరికా.. కాబుల్ డ్రోన్ దాడిలో తీవ్రవాది కాదు అమాయకులు చనిపోయారని వెల్లడి
- నరేంద్ర మోదీ 1993లో అమెరికా పర్యటనకు ఎందుకు వెళ్లారు? 40 రోజులు అక్కడ ఏం చేశారు
- విరాట్ కోహ్లీ: స్థాయి లేనోడా? భయం లేనోడా? ఈ సంజ్ఞపై ఎందుకింత చర్చ?
- చల్లటి నీటిలో స్నానం చేస్తే మైండ్, బాడీ ఫ్రెష్ అవుతుందా....దీని వెనకున్న శాస్త్రీయత ఏంటి?
- 'ఆయన నన్ను పెళ్లి చేసుకోవాలనేం లేదు కానీ నేను ఒక్కరికంటే ఎక్కువ మందిని వివాహం చేసుకుంటా’
- అఫ్గానిస్తాన్: తాలిబాన్ల మొదటి నెల పాలన ఎలా ఉంది?
- 'ఆయన గుర్తుకు వచ్చినప్పుడల్లా నేను ఆయన టీ షర్ట్ వేసుకుంటాను.. ఒక్కోసారి ఆయన మళ్లీ వస్తారని అనిపిస్తుంది’
- తెల్ల జుట్టు కనిపిస్తే ముసలితనం వచ్చేసినట్లేనా? ఎందుకు రంగేసుకుంటారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications