ఐటీ దాడుల టైంలో అనుచిత ప్రవర్తన: తమిళ మంత్రిపై ఫిర్యాదు
చెన్నై: తమిళనాడులో ఐటీ సోదాలు కలకలం రేపాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ నివాసంలో పెద్ద ఎత్తున ఐటీ శాఖ నగదును గుర్తించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మరో 12 మంది శశికళ వర్గం ఎమ్మెల్యేలపై ఐటీ అధికారులు కన్నేశారని తెలుస్తోంది.
అధికార పార్టీకి చెందిన మంత్రులు, నేతలపై ఐటీ శాఖ ప్రధానంగా దృష్టి సారించింది. సోదాల సమయంలో అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ డాక్యుమెంట్ల ఆధారంగా మరింతమంది మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఐటీ అధికారులు దృష్టి సారించనున్నారని తెలుస్తోంది.
ఐటీ అధికారులు తమిళనాడులో మరిన్ని దాడులు చేసే అవకాశముంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అధికారులు రూ.85 కోట్ల విలువైన పత్రాలు, నగదును ఇప్పటి దాకా స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఎక్కువ మొత్తాన్ని ఆర్కే నగర్ ఉప ఎన్నికల కోసం దాచిపెట్టినట్లుగా గుర్తించారు.

మంత్రి విజయ భాస్కర్ నివాసంలో ఐటీ దాడులు జరిగాయి. ఆ తర్వాత మరిన్ని జరిగే అవకాశముందని చెబుతున్నారు.
నిబంధనల ప్రకారం ఐటీ దాడుల సమయంలో ఏ వ్యక్తి కూడా ఇంటిని వదలకూడదు. కానీ మంత్రి విజయభాస్కర్ మాత్రం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. అలా చేయకూడదని ఆపబోయిన సీఐఎస్ఎఫ్ జవానును మంత్రి తోసేశారు. ఈ అంశాన్ని అధికారులు ఎన్నికల కమిషన్‌కు రిపోర్ట్ చేశారు.
గత వారం విజయభాస్కర్ నివాసంలో దాడులు జరిపినప్పుడు ఐటీ అధికారుల పట్ల విజయభాస్కర్ అనుచితంగా వ్యవహరించారని ఆ రిపోర్టులో ఉంది. కాగా, ఆర్కే నగర్ ఉప ఎన్నికలకు డబ్బు వెళ్తుందన్న సమాచారంతో మొత్తం 30 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications