26 మంది ఐపీఎస్ అధికారుల సంచలన నిర్ణయం, కేంద్రంతో ఢీ ?, ఎందుకు పిలిచారు ?

కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారులను బలవంతంగా కేంద్ర ప్రభుత్వ సర్వీసుకు సిఫార్సు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతుండగా ఆ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారులు కొందరు కేంద్ర ప్రభుత్వ సర్వీసులో చేరడానికి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై ఇప్పుడు కర్ణాటకలో ఐపీఎస్ అధికారులు సంచలన నిర్ణయం తీసుకుంటున్నారని తెలిసింది.

కర్ణాటకలోని ఎస్పీ గ్రేడ్ ఐపీఎస్ అధికారులు కొందరు తమను ఒక్క మాట కూడా అడగకుండా బలవంతంగా కేంద్ర హోమ్ శాఖకు సిఫార్సు చేశారని ఆరోపిస్తున్నాని తెలిసింది. కొందరు ఐపీఎస్ అధికారులు ఇదే విషయంలో అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి లిఖిత పూర్వకంగా తమ అభిప్రాయం తెలపాలనే ఆలోచనలో కొందరు ఐపీఎస్ అధికారులు ఉన్నాని తెలిసింది.

It is learned that 26 IPS officers from Karnataka are thinking of not going to Central Government services

అందరూ ఆశ్చర్యపోయేలా కేంద్ర హోమ్ శాఖ మొత్తం 28 మంది ఎస్పీ గ్రేడ్ ఐపీఎస్ అధికారులను కేంద్ర ప్రభుత్వ సర్వీసుకు సిఫార్సు చేసిందని తెలిసింది. అందులో 26 మంది ఐపీఎస్ అధికారులు కర్ణాటకకు చెందిన వారే ఉన్నారని సమాచారం. ఇలా కేంద్ర ప్రభుత్వ సర్వీస్‌ను సిఫార్సు చేయాల్సిన డీపీఆర్‌పై కొందరు ఐపీఎస్‌ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారని వెలుగు చూసింది.

తమ అభిప్రాయాన్ని అడగకుండానే డీపీఏఆర్‌ తమ పేర్లు పంపడంపై అసంతృప్తితో ఉన్నారని, మరికొందరు కేంద్ర ప్రభుత్వ సిఫార్సును తిరస్కరించాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. బెంగళూరు డీసీపీలు అయిన సీకే..బాబా, ఎస్.గిరీష్, డి. దేవరాజ్, డి. ఆర్. సిరిగౌరి, అబ్దుల్ అహాద్, అమృత్ ప్రకాష్ నిఖమ్ లతో పాటు ఎస్పీలు ఇలకియ కరుణాకరన్, డాక్టర్ భీమశంకర్ గులేద్, ధర్మేంద్ర కుమార్ మీనా, శ్రీనాథ్ మహదేవ్ జోషి తదితరులను కూడా కేంద్రం పిలిపించింది. అయితే కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు వెళ్లడానికి ఈ ఐపీఎస్ అధికారులు సిద్దంగా లేరని, వారు చాలా అసహనంగా ఉన్నారని కన్నడ మీడియా అంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+