ఐటీ అధికారులకు షాక్: దినకరన్ ఫాంహౌస్ లో సీక్రెట్ గదులు, లాక్ నెంబర్లు గుర్తులేవు, సీజ్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ అసలు బండారం బయటపడింది. పుదుచ్చేరి సమీపంలోని ఆరువెళ్లి ప్రాంతంలో టీటీవీ దినకరన్ కు చెందిన ఫాంహౌస్ లో సోదాలు చేస్తున్న అధికారులు శుక్రవారం షాక్ కు గురైనారు.

ఐటీ షాక్: శశికళ ఫ్యామిలీలో రూ. కోట్ల విలువైన పత్రాలు సీజ్, జయలలితను అడ్డం పెట్టుకుని!

టీటీవీ దినకరన్ కు చెందిన ఫాంహౌస్ లో అండర్ గ్రౌండ్ లోని సీక్రెట్ గదులు ఉన్న విషయాన్ని గుర్తించిన ఆదాయపన్ను శాఖ అధికారులు వాటి తలుపులు తియ్యడానికి ప్రయత్నించి విఫలం అయ్యారని తెలిసింది. అండర్ గ్రౌండ్ లో ఉన్న గదులకు సరికొత్త టెక్నాలజీ సీక్రెట్ డోర్ లాక్ లు ఏర్పాటు చేశారని తెలిసింది.

100 ఎకరాల్లో ఫాంహౌస్ !

100 ఎకరాల్లో ఫాంహౌస్ !

పుదుచ్చేరి సమీపంలోని అరువెళ్లి ప్రాంతంలో టీటీవీ దినకరన్ కు చెందిన దాదాపు 100 ఎకరాల్లో ఫాంహౌస్ ఉంది. అరువెళ్లి పర్యాటక ప్రాంతం. ప్రతినిత్యం అరువెళ్లి ప్రాంతానికి విదేశీలు వచ్చి వెలుతుంటారు. ఇలాంటి ప్రాంతంలో టీటీవీ దినకరన్ ఫాంహౌస్ కొనుగోలు చేశారు.

సీక్రెట్ లాక్ నెంబర్లు !

సీక్రెట్ లాక్ నెంబర్లు !

ఫాంహౌస్ లోని అండర్ గ్రౌండ్ లో ఉన్న గదులకు ఏర్పాటు చేసిన అత్యాధునిక సీక్రెట్ లాక్ కోడ్ లు చెప్పాలని ఆదాయపన్ను శాఖ అధికారులు టీటీవీ దినకరన్ ను అడిగారని తెలిసింది. అయితే డోర్ లాక్ నెంబర్లు మరిచిపోయానని, తనకు గుర్తు లేదని టీటీవీ దినకరన్ అధికారులకు చెప్పారని సమాచారం.

నిపుణులతో భేటీ

నిపుణులతో భేటీ

టీటీవీ దినకరన్ ఫాంహౌస్ లోని అండర్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన గదుల తాళం తియ్యడానికి నకిలి తాళాలు తయారు చేసే అత్యాధునిక నిపుణులను ఆదాయపన్ను శాఖ అధికారులు సంప్రధించారని తమిళ మీడియాలో శుక్రవారం వార్తలు ప్రసారం అయ్యాయి. నిపుణలు వచ్చే వరకూ సీక్రెట్ గదులు ఎవ్వరూ తీయ్యకుండా అధికారులు సీజ్ వేశారు.

అండర్ గ్రౌండ్ లో ఎందుకు ?

అండర్ గ్రౌండ్ లో ఎందుకు ?

దాదాపు 100 ఎకరాల ఫాంహౌస్ లో ఎక్కడైనా గదులు నిర్మించుకునే అవకాశం ఉన్నా అండర్ గ్రౌండ్ లో సీక్రెట్ గదులు ఎందుకు నిర్మించారు ? అంటూ ఆదాయపన్ను శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. అక్రమాస్తుల పత్రాలు, బ్లాక్ మనీ దాచి పెట్టడానికి అండర్ గ్రౌండ్ లో గదులు నిర్మించి ఉంటారని ఆదాయపన్ను శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 దినకరన్ అనుచరుల్లో ఆందోళన !

దినకరన్ అనుచరుల్లో ఆందోళన !

టీటీవీ దినకరన్ అనుచరుల్లో అప్పుడే ఆందోళన మొదలైయ్యింది. ఫాంహౌస్ లో అండర్ గ్రౌండ్ లో గదులు నిర్మించారని శుక్రవారం తమిళ మీడియాలో వార్తలు ప్రసారం కావడంతో మళ్లీ మా నాయకుడిని కష్టాలు ఎదురౌతాయా అంటూ టీటీవీ దినకరన్ అనుచరులు ఆందోళన చెందుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Income Tax officials conducted a raid at Dinakaran's farm house at Auroville in Puducherry on Thursday. The officials were shocked over the underground secret rooms in the Dinakaran's Farm House.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి