వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్ స్ధానిక పోరులో ప్రాంతీయ కూటమి హవా- తర్వాతి స్ధానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌

|
Google Oneindia TeluguNews

జమ్మూ కశ్మీర్‌లోని 280 జిల్లా అభివృద్ధి కౌన్సిళ్లకు తాజాగా ఎన్నికలు జరిగాయి. వీటిలో ప్రాంతీయ పార్టీలన్నీ ఓ కూటమిగా ఏర్పడి గుప్కార్‌ అలయన్స్‌ పేరుతో పోటీ చేశాయి. బీజేపీ, కాంగ్రెస్‌ వేర్వేరుగా పోటీ చేశాయి. వీటి ఓట్ల లెక్కింపు ఇవాళ సాగుతోంది. తాజా ఫలితాల ప్రకారం స్ధానిక పార్టీల కూటమి గుప్కార్‌ అలయన్స్‌ ఫలితాల్లో దూసుకుపోతోంది.

జమ్మూ కశ్మీర్‌ జిల్లా అభివృద్ధి కౌన్సిళ్ల ఎన్నికల ఫలితాల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ ఇతర పార్టీలతో కూడిన గుప్కార్‌ అలయన్స్‌ ఇప్పటివరకూ 88 స్ధానాల్లో ఆధిక్యం కొనసాగిస్తోంది. మరో 44 సీట్లలో బీజేపీ ఆధిక్యం కొనసాగుతోంది. కాంగ్రెస్ మాత్రం 21 స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో ఈ ఎన్నికల్లో గుప్కార్‌ కూటమి ఆధిక్యం స్ఫష్టంగా కనిపిస్తోంది. అయితే ప్రాంతాల వారీగా చూసినప్పుడు కశ్మీర్‌ ప్రాంతంలో మాత్రమే ఈ కూటమి హవా కొనసాగుతోంది.

J&K DDC election results: Gupkar Alliance leads in 88 seats, BJP 46, Congress 21

జమ్మూ కశ్మీర్‌ జిల్లా అభివృద్ధి కౌన్సిళ్ల ఎన్నికల ఫలితాల్లో ప్రాంతాల వారీగా ఫలితాలను విశ్లేషిస్తే కశ్మీర్‌ లోయలో ఉన్న జిల్లా కౌన్సిళ్లలో గుప్కార్ కూటమి హవా కనిపిస్తోంది. ఇక్కడ కూటమి 61 స్ధానాల్లో దూసుకెళ్తోంది. బీజేపీ కేవలం 3 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉంది. కానీ జమ్మూ ప్రాంతంలో మాత్రం బీజేపీ 44 స్ధానాలతో ముందుంది. గుప్కార్‌ కూటమి ఇక్కడ 20 స్ధానాల్లో ఆదిక్యం కొనసాగిస్తోంది.
ఆర్టికల్‌ 356 రద్దు తర్వాత ఇక్కడ జరుగుతున్న ఎన్నికలు కావడంతో వీటి ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

J&K DDC election results: Gupkar Alliance leads in 88 seats, BJP 46, Congress 21
English summary
The counting of votes is underway for 280 constituencies in the Jammu and Kashmir’s District Development Council (DDC) elections. gupkar alliance leads the results with 88 seats and bjp lead in 46 and congress in 21 seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X