వీడియో: యోగి ఆదిత్యనాథ్ కాళ్లు మొక్కిన రజినీకాంత్..!!
లక్నో: సౌతిండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ.. జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. సన్ పిక్చర్స్ పతాకం కింద కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. రమ్యకృష్ణ, వసంత్ రవి, వినాయకన్, యోగిబాబు, సునీల్, మిర్నామీనన్.. కీలక పాత్రలను పోషించారు.
బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్టించింది ఈ మూవీ. ఈ ఏడాదిలో ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా రికార్డ్ సృష్టించింది. విడుదలైన అతి కొద్దిరోజుల్లోనే 450 కోట్ల రూపాయలను వసూలు చేసింది. టైగర్ ముత్తువేల్ పాండ్యన్‌గా రజినీకాంత్ నటనకు ప్రేక్షకులకు బ్రహ్మరథం పట్టారు.

ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు భారీగా ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ సినిమాను చూడటానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం ఆసక్తి చూపారంటే.. దీనికి ఉన్న క్రేజ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. హిమాలయాల్లో పర్యటించి వచ్చిన అనంతరం రజినీకాంత్.. జార్ఖండ్ వెళ్లారు.
#WATCH | Actor Rajinikanth meets Uttar Pradesh CM Yogi Adityanath at his residence in Lucknow pic.twitter.com/KOWEyBxHVO
— ANI (@ANI) August 19, 2023
ఈ ఉదయం ఉత్తర ప్రదేశ్‌కు వచ్చారు. రాజ్ భవన్‌లో ఆ రాష్ట్ర గవర్నర్ ఆనంది బెన్ పటేల్‌ను మర్యాదపూరకంగా కలుసుకున్నార. రాజధాని లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. తన భార్య లత రజినీకాంత్‌తో కలిసి లక్నోలో ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి వెళ్లారు. అక్కడ రజినీకాంత్ దంపతులకు ఘన స్వాగతం లభించింది. యోగి ఆదిత్యనాథ్ ఎదురువెళ్లి మరీ వారికి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రజినీకాంత్.. యోగి కాళ్లు మొక్కడం కనిపించింది.
అంతకంటే ముందు- లక్నోలో జైలర్ సినిమా కోసం ఓ స్పెషల్ ప్రీమియర్ షో వేశారు. రజినీకాంత్‌తో కలిసి ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఈ సినిమాను చూశారు. షో ముగిసిన అనంతరం రజినీకాంత్ నేరుగా యోగి ఆదిత్యనాథ్ నివాసానికి చేరుకున్నారు. ఆయన కోసం మరో షో వేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications