వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్ వరద: సోషల్ మీడియాలో, ఆపరేషన్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: భారీ వర్షాలు, వరదలతో జమ్ము కాశ్మీర్ అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఈ వరదల కారమంగా దాదాపు పదిహేను వేల మంది వరకు గల్లంతైనట్లుగా భావిస్తున్నారు. వీరి కోసం వారి బంధువులు సోషల్ మీడియాను కూడా ఆశ్రయిస్తున్నారు.

ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించారు. జాతీయ విపత్తుగా ప్రకటించారు. ప్రజలు భయాందోళనకు గురి కావొద్దని, తాము ఆదుకుంటామని, అవసరమైన బోట్లను పంపిస్తామని, చాపర్స్ కూడా సిద్ధంగా ఉన్నాయని, విమానాలు సిద్ధంగా ఉన్నాయని ఆదివారం ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు.

దాదాపు పదిహేను వేల మంది ఆచూకీ లభించడం లేదని తెలుస్తోంది. రెండువేల మంది వరకు రిలీఫ్ క్యాంపుకు తరలించారు. హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. హెల్ప్ లైన్ నంబర్లు.. ఢిల్లీ J&K హౌజ్ - 011 24611210, 24611108; శ్రీనగర్ - 0194-2452138; జమ్ము - 0191-2560401. ఇస్రో ఇప్పటికే వరదకు సంబంధించిన చిత్రాలను పంపించింది.

 జమ్ము కాశ్మీర్ వరదలు

జమ్ము కాశ్మీర్ వరదలు

భారీ వర్షాలు, వరదలతో జమ్ము కాశ్మీర్ అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఈ వరదల కారమంగా దాదాపు పదిహేను వేల మంది వరకు గల్లంతైనట్లుగా భావిస్తున్నారు. వీరి కోసం వారి బంధువులు సోషల్ మీడియాను కూడా ఆశ్రయిస్తున్నారు.

 జమ్ము కాశ్మీర్ వరదలు

జమ్ము కాశ్మీర్ వరదలు

జమ్మూ కాశ్మీర్ వరదల నేపథ్యంలో ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తదితరాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. వరదల్లో చిక్కుకు పోయిన వారి కోసం వీరు అహోరాత్రులు శ్రమిస్తున్నారు.

 జమ్ము కాశ్మీర్ వరదలు

జమ్ము కాశ్మీర్ వరదలు

ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జమ్ము కాశ్మీర్‌లో 150 మంది వరకు మృతి చెందారు. వరదల్లో చిక్కుకుపోయిన వారి కోసం గాలిస్తున్నారు.

 జమ్ము కాశ్మీర్ వరదలు

జమ్ము కాశ్మీర్ వరదలు

వరదల్లో చిక్కుకు పోయిన వారిని విమానాలు, హెలికాప్టర్లు, పడవల ద్వారా రక్షిస్తున్నారు. వారిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు.

 జమ్ము కాశ్మీర్ వరదలు

జమ్ము కాశ్మీర్ వరదలు

అరవయ్యేళ్ల తర్వాత జమ్ము కాశ్మీర్‌లో వరదల కారణంగా ఇంతటి అతలాకుతలం కనిపిస్తోంది. పలు గ్రామాలు నీట మునిగాయని, మంచు కొండచరియలు విరిగిపడుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

 జమ్ము కాశ్మీర్ వరదలు

జమ్ము కాశ్మీర్ వరదలు

వర్షాలు, వరదల కారణంగా పక్క దేశమైన పాకిస్తాన్‌లో కూడా 160 మంది వరకు మృతి చెందారు. వేలాది ఇళ్లు నీట మునిగిపోయాయి.

 జమ్ము కాశ్మీర్ వరదలు

జమ్ము కాశ్మీర్ వరదలు

గత అరవై ఏళ్లలో రాష్ట్రంలో ఇంత తీవ్ర వరదలు ఎప్పుడూ సంభవించలేదని, 2500 గ్రామాలు వరద తాకిడికి గురికాగా, వాటిలో 450 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.

జమ్ము కాశ్మీర్ వరదలు

జమ్ము కాశ్మీర్ వరదలు

జమ్ము కాశ్మీర్ వరదల నేపథ్యంలో.. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50 వేలు పరిహారం రాజ్ నాథ్ సింగ్ ఆదివారం ప్రకటించారు.

 జమ్ము కాశ్మీర్ వరదలు

జమ్ము కాశ్మీర్ వరదలు

ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించారు. జమ్ము కాశ్మీర్ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించారు.

 జమ్ము కాశ్మీర్ వరదలు

జమ్ము కాశ్మీర్ వరదలు

ప్రజలు భయాందోళనకు గురి కావొద్దని, తాము ఆదుకుంటామని, అవసరమైన బోట్లను పంపిస్తామని, చాపర్స్ కూడా సిద్ధంగా ఉన్నాయని, విమానాలు సిద్ధంగా ఉన్నాయని ఆదివారం ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు.

 జమ్ము కాశ్మీర్ వరదలు

జమ్ము కాశ్మీర్ వరదలు

వరదల కారణంగా దాదాపు పదిహేను వేల మంది ఆచూకీ లభించడం లేదని తెలుస్తోంది. రెండువేల మంది వరకు రిలీఫ్ క్యాంపుకు తరలించారు.

English summary
Jammu and Kashmir, hit by severe floods, is facing one of the worst natural disasters in its history. The prime minister has called it a "national-level disaster." Around 150 people have been killed in the floods and heavy rains in the state so far.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X