Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాశ్మీర్ కొండలపై జెండా పాతేదెవరు?

Jammu Kashmir Assembly Election Results 2024: కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఈ ఉదయం సరిగ్గా 8 గంటలకు ఓట్ల లెక్కింపు ఆరంభమౌతుంది. ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినందున- ఫలితాలు ఎటా ఉంటాయనే విషయంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.

మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఇది. పదేళ్లుగా ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగలేదు. చివరి ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ. 2018 జులైలో అసెంబ్లీ రద్దయింది. ఆ మరుసటి ఏడాదే కేంద్ర ప్రభుత్వం.. ఆర్టికల్ 370ని రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్, లఢక్‌గా విభజించింది. ఈ రెండింటినీ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది.

Jammu Kashmir Counting Centre

ఆ తరువాత మళ్లీ ఇక్కడ ఎన్నికలను నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏ పార్టీ అధికారాన్ని అందుకుంటుందనేది ఆసక్తిగా మారింది. నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ మధ్య ఇక్కడ ప్రధానంగా పోటీ నెలకొంది.

ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో పాగా వేసేదెవరనే విషయంపై ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా జమ్మూ కాశ్మీర్‌లో హంగ్ ఏర్పడుతుందనే అంచనాలను వ్యక్తం చేశాయి. ఇక వాస్తవ ఫలితాలు ఎలా ఉండబోతోన్నాయనేది ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది.

హంగ్ అసెంబ్లీ ఏర్పడితే మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీ, ఇందులో- బారాముల్లా లోక్‌సభ సభ్యుడు ఇంజినీర్ రషీద్‌కు చెందిన ఆవామీ ఇత్తెహాద్, ఇతర చిన్న పార్టీలు, స్వతంత్రులు ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఏ మాత్రం హంగ్ ఏర్పడినా చిన్న పార్టీలు, స్వతంత్రులకు డిమాండ్ ఏర్పడవచ్చు.

ఇది కాస్తా- రిసార్ట్స్, క్యాంప్ పాలిటిక్స్‌కు తెర తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. స్వతంత్రులకు ప్రభుత్వంలో కల్పించడం, మంత్రివర్గంలో వారికి కీలక పోర్ట్ ఫోలియోలు దక్కొచ్చనే అంచనాలు ఉన్నాయి.

కాగా- ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. జమ్మూలోని పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు, భద్రత సిబ్బందిని మోహరింపజేశారు. పారా మిలటరీ బలగాలను అందుబాటులో ఉంచారు. పోలింగ్ కేంద్రానికి దారి తీసే మార్గాలన్నింట్లోనూ వాహనాల తనిఖీని ముమ్మరం చేశారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల అధికారులు, స్థానిక యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలపై నిఘా ఉంచింది. అలాంటి ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+