సీరియస్: ఎయిమ్స్ లో జమ్మూ కాశ్మీర్ సీఎం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముప్తీ మహమ్మద్ సయిూద్ (79) అనారోగ్యానికి గురికావడంతో ఢిల్లీకి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఆయనను జాతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో చికిత్స అందిస్తున్నారు.
గురువారం శ్రీనగర్ లోని ఇంటిలో ఉన్న ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయిూద్ తీవ్ర అస్వస్థతకు గురైనారు. వెంటనే ఆయనను జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు.

తరువాత ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ముఫ్తీ అహమ్మద్ సయిూద్ కు మెరుగైన చికిత్స అందిస్తున్నామని ఆయన కొలుకుంటున్నారని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు ఆసుపత్రి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.
జమ్మూ కాశ్మీర్ లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడంతో గత మార్చిలో ముఫ్తీ మహమ్మద్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. జమ్మూ కాశ్మీర్ లోని పీడీపీకి చెందిన పలువురు నాయకులు ఢిల్లీకి పరుగు తీశారు.












Click it and Unblock the Notifications