జయకోసం ఢిల్లీలో కుర్చీ మోశారు: జైట్లీతో భేటీ(పిక్చర్స్)
చెన్నై/న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. జయలలితను అభిమానులు పురుచ్చితలైవీ అంటారు. ఆమెకు వంగి దండాలు పెడతారు.
బుధవారం ఆమె ఢిల్లీలో పర్యటించినప్పుడు అన్నాడిఎంకె ఎంపీలు దండాలు పెట్టారు. అంతేకాదు ఆమె అరుణ్ జైట్లీతో సమావేశమైనప్పుడు ప్రత్యేకంగా కుర్చీ తెప్పించుకున్నారు. సమావేశం అనంతరం ఈ కుర్చీని తమిళనాడు భద్రతాధికారి జాగ్రత్తగా తీసుకెళ్లి భద్రపర్చారు.
ప్రత్యేక కుర్చీ పైన భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వెన్నునొప్పి కారణంగానే ఆమె ప్రత్యేక కుర్చీ తెచ్చుకున్నారని ఓ వాదన ఉంది. ఆర్థికమంత్రితో సమావేశంలో ఈ కుర్చీలో కూర్చుంటే నిధులు వస్తాయని సెంటిమెంట్ ఉన్నందువల్లే ఆమె అందులో కూర్చున్నారనే వాదన కూడా ఉంది. మరోవైపు రాజ్యసభలో మోడీ సర్కారుకు మద్దతిచ్చే విషమయై జయలలిత స్పష్టత ఇవ్వలేదు.

జయ-మోడీ
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఇరువురు పరస్పరం నమస్కరించుకుంటున్న దృశ్యం.

జయ-మోడీ
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు.

జయ-మోడీ
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. మోడీకి వినతి పత్రం ఇస్తున్న జయ.

జయ-ప్రణబ్
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. రాష్ట్రపతికి పుష్పగుచ్చం ఇస్తూ...

జయ-జైట్లీ
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత మంగళవారం ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. జైట్లీకు పుష్పగుచ్ఛం ఇస్తూ...

జయ-జైట్లీ
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత మంగళవారం ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. వినతి పత్రం ఇస్తున్న జయ.












Click it and Unblock the Notifications