అభిమానులు ఏ చర్యలకు పాల్పడొద్దు, సంచలనం రేపుతున్న జయలలిత ఫోటో
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం పైన ఎలాంటి ఆందోళన అవసరం లేదని, అభిమానులు ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని ఆ పార్టీ నాయకులు సరస్వతి ఆదివారం నాడు సూచించారు.
అమ్మ ఆరోగ్యం పైన ఎవరు కూడా దుష్ప్రచారం చేయవద్దన్నారు. జయ ఆరోగ్యంపై వైద్యులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారని చెప్పారు. జయలలిద వల్లే కావేరీ జలాలు తమిళనాడుకు వస్తున్నాయన్నారు. కావేరీ జలాల పైన కర్నాటక ప్రత్యేక అసెంబ్లీ సరికాదన్నారు.
అమ్మకు దిష్టిపోవాలని తాము ఇక్కడే (అపోలో ఆసుపత్రి మెయిన్ గేటు వద్ద) పూజలు చేస్తున్నామన్నారు. అమ్మ ఆరోగ్యం పైన గవర్నర్ విద్యాసాగర రావు ప్రకటన చేయడంతో మరింత ధైర్యం పెరిగిందన్నారు. వైద్యులు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని చెప్పారు.

సంచలనం సృష్టిస్తున్న అమ్మ ఫోటో
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై పుకార్లు కొనసాగుతున్నాయి. ఆగడం లేదు. సోషల్ మీడియాలో జయ ఆరోగ్యంపై పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే అమ్మకు సంబంధించిన ఒక ఫొటో వైరల్‌గా మారింది.
జయలలిత ఆసుపత్రి బెడ్ పైన ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని చికిత్స తీసుకుంటున్నట్లు ఉన్న ఫొటో ఒకటి నెట్లో చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆ ఫొటోను అనేకమంది షేర్ చేస్తున్నారు.
అయితే ఆ ఫొటో ఇప్పటిది కాదని. అమ్మ ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందొద్దని, కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఫోటో ఏడేళ్ల క్రితం పెరూలోని ఎస్‌స్లాడ్ ఆసుపత్రిలో ఆమె చికిత్స తీసుకుంటున్నప్పటిదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం పైన ఎలాంటి ఆందోళన అవసరం లేదని, అభిమానులు ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని ఆ పార్టీ నాయకులు సరస్వతి ఆదివారం నాడు సూచించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications