వాళ్లూ.. వీళ్లూ కాదు.. జయలలితే స్వయంగా!: శోభన్ బాబుతో సహజీవనంపై అమ్మ రాసిన లేఖ ఇది..

Subscribe to Oneindia Telugu
  Jayalalitha Daughter:Jayalalitha's Letter on Relationship With Shobhan Babu

  చెన్నై: జయలలిత కుమార్తెనని చెబుతూ అమృత అనే యువతి తెర పైకి రావడంతో.. తమిళనాడులో ఇదే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జయలలిత-శోభన్ బాబుల అనుబంధం గురించే ఎక్కువమంది చర్చించుకుంటున్నారు.

  డీఎన్ఏ పరీక్షకైనా సిద్దమంటూ అమృత కర్ణాటక హైకోర్టును ఆశ్రయించడానికి సిద్దమవుతున్నారు. మరోవైపు అమృత జయలలిత-శోభన్ బాబుల కుమార్తెనె అనేందుకు రోజురోజుకు ఆధారాలు బలపడుతూనే ఉన్నాయి. జయలలిత స్నేహితురాలు గీత ఇప్పటికే అమృత ఆమె బిడ్డే అని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

  అప్పట్లో శోభన్ బాబు సైతం ఇదే విషయాన్ని తనతో చెప్పినట్లుగా ఆమె వెల్లడించారు. అయితే జయలలితే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించినట్లుగా ఓ కథనం వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.

  స్వయంగా జయనే చెప్పింది:

  స్వయంగా జయనే చెప్పింది:

  శోభన్ బాబుతో తాను సహజీవనం చేస్తున్నానని, అయితే ఆయన వివాహితుడు కావడం వల్లే పెళ్లి చేసుకోలేకపోతున్నానని 1979లోనే జయలలిత అంగీకరించినట్లు తెలుస్తోంది.

  ఈ మేరకు స్టార్ అండ్ స్టైల్ అనే ఆంగ్ల పత్రికకు అప్పట్లో జయలలితే స్వయంగా లేఖ రాశారు. ఈ విషయం ఇప్పుడు బయటకు రావడంతో అమృత ఆమె కూతురే అన్న అనుమానాలు బలపడుతున్నాయి. అంతేకాదు.. జయలలితకు కూతురు ఉన్న మాట వాస్తవమేనని జయ మేనత్త కూతురు లలిత కూడా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

  శోభన్-జయల మధ్య స్నేహాన్ని మించి?: 'అమృత' వాళ్ల బిడ్డే.. 'అప్పట్లో ఆయనే చెప్పారని!'

  పిటిషన్‌లో ఇలా:

  పిటిషన్‌లో ఇలా:

  ఆగస్టు 14, 1980లో జయలలితకు అమృత జన్మించినట్లుగా పిటిషన్‌లో పేర్కొన్నారు. తన పెంపుడు తల్లి శైలజ 2015లో, తండ్రి ఈ ఏడాది మార్చి 20న మృతి చెందినట్లు అందులో పొందుపరిచారు.

  పెళ్లికాకుండా బిడ్డకు జన్మనిచ్చానన్న సంగతి బయటి ప్రపంచానికి తెలిస్తే.. తన కీర్తి ప్రతిష్ఠలు దెబ్బతింటాయని భావించే ఇన్నాళ్లు తన విషయం రహస్యంగా ఉంచారని అందులో అమృత పేర్కొన్నారు.

  తాను జయలలిత కుమార్తెను అని నిరూపించడానికి తనకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టులో అమృత దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం సోమవారం కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయితే పిటిషన్‌దారు హైకోర్టుకు వెళ్లవచ్చని పేర్కొనడంతో.. ఆమె కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.

  న్యాయస్థానం ఏం తేలుస్తుందో!:

  న్యాయస్థానం ఏం తేలుస్తుందో!:

  అమృత విషయం ఇలా ఉంటే, తానే జయలలితకు అసలైన వారసుడినంటూ కృష్ణమూర్తి అనే యువకుడు ఈ ఏడాది మార్చిలో తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అతను ఫేక్ అని గుర్తించినట్లు ప్రచారం జరిగింది. తాజాగా అమృత కర్ణాటక హైకోర్టును ఆశ్రయించడానికి సన్నద్దమవుతున్న తరుణంలో.. న్యాయస్థానం ఏం నిర్దారిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.

  సోగ్గాడితో ప్రేమ:

  సోగ్గాడితో ప్రేమ:

  ఇండస్ట్రీలో అప్పుడప్పుడే హీరోగా రాణిస్తున్న శోభన్ బాబు.. అప్పటికే స్టార్ హీరోయిన్ గా ఉన్న జయలలితతో సినిమా కోసం దాదాపు 8 ఏళ్లు ఎదురుచూసినట్లు చెబుతారు. అంతేకాదు, శోభన్ బాబుతో సినిమా కోసం ఓ నిర్మాత జయలలిత తల్లిని సంప్రదిస్తే ఆ సినిమాను ఆమె రిజెక్ట్ చేసిందన్న ప్రచారం కూడా ఉంది. అయితే ఎట్టకేలకు డాక్టర్ బాబు అనే సినిమాతో ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రావడం హిట్ కొట్టడం జరిగిపోయాయి. ఆ తర్వాత తల్లి మరణంతో ఆత్మన్యూనతలో కూరుకుపోయిన జయలలితకు శోభన్ బాబు దగ్గరయ్యారు. అలా ఇద్దరి మధ్య బంధం బలపడిందంటారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Here is the letter from Jayalalithaa to Mumbai Magazine on her relationship with Shobhan babu.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి