వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెన్నైలో జయలలిత మేనకోడలు దీపా కార్యాలయం, శశికళకు ధీటుగా !

జయలలిత మేనకోడలు దీపా కార్యకర్తలతో మాట్లాడటానికి వీలుగా చెన్నైలో కార్యాలయం ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించాచరు. అన్నాడీఎంకే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు చెన్నైలోనే మకాం వేసి మంచి భవనం.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఇక ముందు రాజకీయాల్లో చురుకుగా పాల్గొనడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి రోజు తనను కలుసుకోవడానికి వస్తున్న వేలాధి మంది కార్యకర్తలను కలుస్తున్న దీపా చాల ఓపికగా వారితో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. .

ఆర్ కే నగర్ లో పోటీ చేస్తా, జయ మేనకోడలు దీపా: శశికళకు ఝలక్ !ఆర్ కే నగర్ లో పోటీ చేస్తా, జయ మేనకోడలు దీపా: శశికళకు ఝలక్ !

ఇంతకాలం చెన్నైలోని టీ.నగర్ లోని దీపా ఇంటి దగ్గరే ఆమె అభిమానులు, దీపా పేరవై కార్యకర్తలను కలుస్తున్నారు. అయితే రద్దీ ఎక్కువ అయిపోవడంతో చెన్నై నగరంలోనే ఓ కార్యాలయం ఏర్పాటు చెయ్యాలని దీపా నిర్ణయం తీసుకున్నారు.

Jayalalithaa's niece Deepa Jayakumar has said that she will contest in R K Nagar by election

అన్నింటికి అనువుగా ఉన్న భవనం కోసం యుద్దప్రాతిపదికన అన్వేషిస్తున్నారు. దీపా కార్యాలయం ప్రారంభించడానికి ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు చెన్నైలోనే మకాం వేసి మంచి భవనం కోసం అన్వేషిస్తున్నారు.

పన్నీర్ సెల్వం చాణక్య ప్రదర్శన: ప్రశంసల జల్లుపన్నీర్ సెల్వం చాణక్య ప్రదర్శన: ప్రశంసల జల్లు

దూరం నుంచి వచ్చే కార్యకర్తలు సేద తీరడానికి వీలుగా, వాహనాల పార్కింగ్ కు ఇబ్బంది కలగకుండా ఉండే భవనం కోసం అన్వేషిస్తున్నారు. అయితే దీపా తన ఇంటికి, బస్ స్టాండ్, రైల్వేష్టేషన్ కు దగ్గరగా ఉండే ప్రాంతంలో కార్యాలయం ప్రారంభించాలని నిర్ణయించారు.

జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్ కే నగర్ నియోజక వర్గం నుంచి ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ఇప్పటికే ఆమె మేనకోడలు దీపా ప్రకటించారు. ఆ నియోజక వర్గంలో ప్రచారం చెయ్యడానికి దీపా అభిమానులు రంగం సిద్దం చేశారు.

మొత్తం మీద ఒక్క వారంలోనే కార్యాలయం ఏర్పాటు చెయ్యాలని మా నాయకురాలు దీపా నిర్ణయం తీసుకున్నారని దీపా పేరవై సంస్థ నాయకులు అంటున్నారు. దీపా అభిమానులు కొందరు అయితే ఆర్ కే నగర్ నియోజక వర్గంలోనే కార్యాలయం ప్రారంభించడానికి ఇప్పటికే సిద్దం అయ్యారు.

English summary
Jayalalithaa's niece Deepa Jayakumar, launching herself as a candidate for her political legacy, said today that a majority in Tamil Nadu's ruling AIADMK want her as their leader not her aunt's long time friend Sasikala Natarajan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X