జయలలితకు గుండెపోటు, హుటాహుటిన చెన్నైకి బయలుదేరిన గవర్నర్ విద్యాసాగర రావు
అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు గుండెనొప్పి వచ్చినట్లు అపోలో ఆసుపత్రి వైద్యులు ఆదివారం నాడు సాయంత్రం తెలిపారు.
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు గుండెనొప్పి వచ్చినట్లు అపోలో ఆసుపత్రి వైద్యులు ఆదివారం నాడు సాయంత్రం తెలిపారు. గత రెండున్నర నెలలుగా జయ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న విషయం తెలిసిందే.
ఇటీవల ఆమె ఆరోగ్యం బాగుపడటంతో సాధారణ వార్డుకు తరలించారు. ఆదివారం హఠాత్తుగా ఆమెకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను సాధారణ వార్డు నుంచి ఐసీయుకు తరలించారు. ఈ విషయాన్ని వైద్యులు ప్రకటించారు.

- జయలలితకు ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు గుండెపోటు వచ్చింది. వైద్యులు రాత్రి గం.9.15కు ప్రకటించారు.

- పలువురు మంత్రులు, నేతలు, అధికారులు అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు.
- అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు, నాయకులు అపోలో వద్దకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.
- అన్ని పోలీస్ స్టేషన్లు అలర్ట్‌గా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
- ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావు ముంబై నుంచి చెన్నై బయలుదేరారు.
- కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సీఎం జయలలిత ఆరోగ్యం గురించి ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావును అడిగి తెలుసుకున్నారు.
అంతలోనే..
అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు అమ్మ ఆరోగ్యం బాగుందని చెబుతూ ఈ రోజే ప్రకటన చేశారు. వారు ప్రకటన చేసిన కాసేపటికే ఆమెకు గుండెపోటు వచ్చింది. ఈ విషయం తెలిసి కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
చెన్నై చేరుకున్న విద్యాసాగర రావు
మహారాష్ట్ర గవర్నర్, తమిళనాడు ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావు చెన్నైలో అడుగు పెట్టారు. ఆయన వెంటనే అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications