వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధుసూధన్ అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి కాకుండా అడ్డుకొంది సెల్వమే,ముందుచూపుతోనేనా?

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మధుసూదన్ ను పార్టీ ప్రధానకార్యదర్శిగా చేయాలని భావించారు.అయితే ఈ నిర్ణయాన్ని పన్నీర్ సెల్వం వ్యతిరేకించారు.దీంతో ఆమె తన నిర్ణయాన్ని మార్చుకొన్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చైన్నె:దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్టీ ప్రధాన కార్యదర్శిగా మధుసూదన్ ను చేయాలని భావించారు.అయితే కొందరు పార్టీ నాయకులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తే ఆమె ప్రధాన కార్యదర్శి పదవికి మధుసూధన్ ను ఎంపిక చేయడాన్ని చివరి నిమిషంలో మార్చుకొన్నారు.

అన్నాడిఎంకె పార్టీని బతికున్నంత కాలం జయలలిత అన్నీ తానై నడిపించారు. తాను వ్యక్తిగతంగా ఇబ్బందుల పాలైనా ఆమె పార్టీని కాపాడుకొంటూ వచ్చారు. అయితే పార్టీ అవసరాల రీత్యా మధుసూధన్ ను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టాలని ఆమె భావించారు.అయితే కొందరు నాయకులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు.దీంతో ఆమె మధుసూధన్ కు ఈ పదవిని ఇవ్వలేదు.

jayalalithaa was decided madhusudhan as general secretary of aiadmk

మధుసూధన్ కు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టాలనే ఆలోచన వచ్చిన తరుణంలో ఆమె ఈ విషయాన్ని పన్నీర్ సెల్వంతో చర్చించింది. అయితే ఈ ప్రతిపాదనను సెల్వం వ్యతిరేకించారు. ఈ విషయాన్ని మంగళవారం రాత్రి పన్నీర్ సెల్వం స్వయంగా జయ సమాధి వద్దే ప్రకటించారు.

అన్నాడిఎంకె పార్టీతో పాటు ఎంజిఆర్ తో ఆయనకు అనుబంధం ఉంది.దీంతో ఆయన పార్టీలో కీలక మైన నాయకుడిగా ఎదిగారు. ఎంజిఆర్ అభిమాన సంఘానికి ఆయన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.ఎంజిఆర్ మంత్రివర్గంలో ఆయన మంత్రిగా కూడ పనిచేశారు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో ఆయన మంత్రిగా పనిచేశారు.1991నుండి 96 వరకు ఆయన జయ మంత్రివర్గంలో చేనేత మంత్రిగా పనిచేశారు.

ఆయన చేనేత మంత్రిగా పనిచేసిన కాలంలో ఉచిత చీరెల కుంభకోణంలో ఇరుక్కొన్నారు. ఈ కేసులో ఆయన దోషిగా తేలారు.దీంతో ఆయన జైలు శిక్షను విధించారు.

ఈ కేసు కారణంగానే 1996, 2001 లో అన్నాడిఎంకె పార్టీ టిక్కెట్టును మధుసూధన్ కు ఇవ్వలేదు జయలలిత.అయితే 2007లో జయలలిత ప్రిసీడియం చైర్మెన్ పదవిని సృష్టించి ఈ పదవికి మధుసూధన్ కు కట్టబెట్టారు జయలలిత.

ఆనాటి నుండి ఆయన ఈ పదవిలోనే కొనసాగుతున్నారు. జయ సమాధి వద్దే ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశ్యంతోనే మంగళవారం నాడు రాత్రి పన్నీర్ సెల్వం నోరు తెరిచాడు..

English summary
jayalalithaa was decided madhusudhan as general secretary of aiadmk,panneer selvam and other leaders opposed this decission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X