వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయ మా బిడ్డ: కన్నడ మాండ్య ఎంపీల డిమాండ్, 'కావేరి' ఆగ్రహం

జయలలితను ఆమె పుట్టిన తమ మాండ్యలోనే ఖననం చేయాలని జనతా దళ్(ఎస్) ఎంపీలు మంగళవారం నాడు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ పై ప్రో కన్నడ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

|
Google Oneindia TeluguNews

మాండ్య: జయలలితను ఆమె పుట్టిన తమ మాండ్యలోనే ఖననం చేయాలని జనతా దళ్(ఎస్) ఎంపీలు మంగళవారం నాడు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ పై ప్రో కన్నడ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సదరు ఎంపీల పైన కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దటీజ్ జయలలిత! ఎన్నైనా..: జగన్, 'అమ్మ' వారిని నమ్మేవారు కాదా?

జయలలిత సోమవారం రాత్రి పదకొండున్నర గంటలకు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమెను మెరీనా బీచ్‌లో ఖననం చేయనున్నారు.

ఈ నేపథ్యంలో జేడీ(ఎస్) రాజ్యసభ సభ్యులు కుపంద్ర రెడ్డి, మాండ్య ఎంపీ సీఎస్ పుట్టురాజులు మాట్లాడుతూ.. జయలలిత మృతదేహాన్ని తప్పకుండా మాండ్యలోనే ఖననం చేయాలన్నారు. ఆమె మెమోరియల్ నిర్మించేందుకు కావాలంటే తాము ఎకరం భూమి ఇస్తామని చెప్పారు.

JD(S) MPs want Jayalalithaa to be buried in Mandya, hotbed of Cauveryagitation

జయలలిత మాండ్య కూతురు అని, కాబట్టి ఇక్కడే ఖననం చేయాలన్నారు. దీనిపై ప్రో కన్నడ సంఘాలు, ఇతర రైతు సంఘాలు మండిపడ్డాయి. మాండ్య, మైసూరు ప్రాంత రైతులకు నీళ్లు ఇవ్వకుండా సమస్యలు సృష్టించిన జయలలితను పొగడటం విడ్డూరమని వారు మండిపడ్డారు.

కాగా, జయలలిత అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కేంద్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరిగే అంత్యక్రియలకు ప్రభుత్వ ప్రతినిధులుగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, పొన్ రాధాకృష్ణన్‌లు నియమితులయ్యారు.

సాయంత్రం 4.30గం.కు చెన్నై మెరీనాబీచ్‌లో ఆమె పార్థివదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి. అంతకుముందు, ప్రధాని మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

English summary
MPs of JD(S) from Karnataka said that deceased AIADMK leader J Jayalalithaa should be buried in her birthplace in Mandya. Their statement came under severe criticism by pro-kannada organisations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X