పర్సనాలిటీ ప్రాబ్లం: స్మృతి ఇరానీకి ఉద్యోగం ఇవ్వనన్నారు
న్యూఢిల్లీ: తాను ఒకప్పుడు కేబిన్ క్రూ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నానని, అయితే దానిని జెట్ ఎయిర్ వేస్ తిరస్కరించిందని ప్రస్తుత కేంద్రమంత్రి, బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ చెప్పారు. ఈ విషయాన్ని ఆమె బుధవారం నాడు చెప్పారు.
తన దరఖాస్తును తిరస్కరించినందుకు వారికి ధన్యవాదాలు చెబుతున్నానని ఆమె చమత్కరించారు. తన పర్సనాలిటీ కేబిన్ క్రూ ఉద్యోగానికి సరిపోదని భావించిన జెట్ ఎయిర్ వేస్ తనను తిరస్కరించిందని ఆమె వెల్లడించారు.

ఆమె ఈ విషయాన్ని ఢిల్లీలో జరిగిన ఏపీఏఐ (ఎయిర్ పాసెంజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) కార్యక్రమంలో వెల్లడించారు. కేబిన్ క్రూ ఉద్యోగం లభించకపోవడం మంచిదైందని చెప్పారు. తనకు మెక్ డొనాల్డ్స్‌లో ఉద్యోగం దొరికిందని, అక్కడి నుంచి తన రాజకీయ ప్రయాణం గురించి అందరికీ తెలిసిందే అన్నారు.












Click it and Unblock the Notifications