హత్యాయత్నం: ఎంఎల్ఏకి ఏడేళ్లు జైలు శిక్ష
రాంచీ: హత్యాయత్నం, దాడి, దోపిడి కేసులో జార్ఖండ్ శాసన సభ్యుడికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విదిస్తూ రాంచీ కోర్టు సంచలనమైన తీర్పు చెప్పింది. శాసన సభ్యుడితో పాటు ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్ యూ) కు చెందిన కార్యకర్తను జైలుకు పంపించారు.
2014లో జార్ఖండ్ లో బీజేపీ, ఏజేఎస్‌యూ కలిసి శాసన సభ ఎన్నికలలో పోటి చేశాయి. బీజేపీ అక్కడ ఏజేఎస్ యూకు మిత్ర పక్షం. వీరే అధికారంలో ఉన్నారు. ఏజేఎస్ యూ నుండి కమల్ కిశోర్ భగత్ శాసన సభ్యుడిగా గెలుపోందాడు. 1993వ సంవత్సరంలో డాక్టర్ కేకే సిన్హా ఇంటికి కమల్ కిశోర్ భగత్ తదితరులు వెళ్లారు.

పాట్నాలో జరిగే పార్టీ ర్యాలికి చందాలు ఇవ్వాలని డాక్టర్ సిన్హాకు చెప్పారు. ఇప్పుడు తన దగ్గర డబ్బులు లేవని డాక్టర్ చెప్పడంతో కమల్ కిశోర్ భగత్ రెచ్చిపోయాడు. డాక్టర్ ను క్లీనిక్ లో నుండి బయటకు తోసి దాడి చేశారు. తరువాత అక్కడ ఉన్న నగదు తీసుకుని వెళ్లిపోయారు.
డాక్టర్ సిన్హా ఫిర్యాదు చేయ్యడంతో కమల్ కిశోర్ భగత్ సహ ముగ్గురి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ఒక కార్యకర్త మరణించాడు. 23 సంవత్సరాల పాటు కేసు విచారణ జరిగింది. మంగళవారం రాంచీ కోర్టులో విచారణ జరిగింది.
కమల్ కిశోర్ భగత్ డాక్టర్ మీద దాడి చేశాడనే విషయాన్ని ధ్రువీకరిస్తూ న్యాయస్థానం ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అతని తోపాటు పార్టీ కార్యకర్తకు జైలు శిక్ష విధించారు. శాసన సభ్యుడు కమల్ కిశోర్ భగత్ ను బిర్సా ముండా సెంట్రల్ జైలుకు తరలించారు.












Click it and Unblock the Notifications